మధ్యప్రదేశ్‌కు చెందిన నిఖిత పోర్వాల్ ఫెమినా మిస్ ఇండియా 2024 కిరీటాన్ని దక్కించుకున్నారు. ముంబైలోని ఫేమస్ స్టూడియోస్‌లో నిన్న రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఆమె గెలుపొందారు. దీంతో మిస్ ఇండియా కిరీటాన్ని గతేడాది విజేతగా నిలిచిన నందిని గుప్తా నిఖితకు కిరీటాన్ని అందించారు. అలాగే, నేహా ధూపియా మిస్ ఇండియా సాష్‌ను అలంకరించారు. ఈ విజయంతో నిఖిత మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమయ్యారు.
వీరే రన్నరప్‌గా నిలిచారు..
ఈ 60వ ఫెమీనా మిస్ ఇండియా కాంపిటేషన్‌లో భాగంగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అమ్మాయిలు పాల్గొన్నారు. ఇక్కడ అందాలతోనే కాదు, వారి ప్రతిభను కూడా ప్రామాణికంగా తీసుకుంటారు. అలా జడ్జిల నుంచి వారు ప్రశంసలు అందుకుని, వరుస రౌండ్ల అనంతరం చివరి రౌండ్‌లో మంచి ప్రతిభ కనబరిచిన నిఖిత అందాల కిరీటాన్ని సొంతం దక్కించుకున్నారు. ఈ పోటీలో మిస్ ఇండియా 2024 మొదటి రన్నరప్‌గా రేఖా పాండే, రెండవ రన్నరప్‌గా ఆయుశీ దోలకియాలు నిలిచారు. మాజీ మిస్ ఇండియా సంగీతా బిజ్లానీ గ్రాండ్ ఫినాలేకు హాజరై సందడి చేశారు.
చాలా గర్వంగా ఉందంటూ..
పోటీలో గెలిచి, టైటిల్ అందుకున్న అనంతరం తన సంతోషాన్ని నిఖిత పోర్వాల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఆనందాన్ని తాను వర్ణించలేనని, మాటలు కూడా రావడం లేదని చెప్పుకొచ్చారు. ఈ విజయంతో తన తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూసిన తర్వాత గర్వంగా ఫీలవుతున్నట్లు తెలిపారు. అయితే, తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని, సాధించాల్సింది చాలా ఉందని వెల్లడించారు. తర్వాత జరగబోయే మిస్ వరల్డ్ పోటీల్లో కూడా నిఖిత విజయం సాధిస్తుందని నెటిజర్‌లు ఆమెకు అభినందనలు చెబుతూ.. సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
Author: VS NEWS DESK
pradeep blr