గాంధీ కుటుంబం నుంచి మరొకరు పార్లమెంట్ కు ఎంపికయ్యారు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ప్రియాంక గాంధీ భారీ మోజార్టీతో విజయం సాధించారు. వాయనాడ్ లో తన అన్న రాహుల్ సాధించిన మెజార్టీని అధిగమించారు. 4 లక్షల 4 వేల 619 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ బీజేపీ మూడో స్థానానికి పరిమితం అయింది. ఇప్పటికే తల్లి సోనియా, అన్న రాహుల్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. కాగా, ఇప్పుడు ప్రియాంక అదే కుటుంబం నుంచి మూడో వ్యక్తిగా కలిసి పార్లమెంట్ కు వెళ్లనున్నారు.
ప్రియాంక గాంధీ పార్లమెంట్ కు ఎంపికయ్యారు. తన అన్న రాజీనామాతో ఖాళీ అయిన వాయనాడ్ స్థానం నుంచి ప్రియాంక విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి ఎల్డీఎఫ్ అభ్యర్ధి పైన 4 లక్షల 4 వేల 619 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎల్డీఎఫ్అభ్యర్థి సత్యన్ రెండో స్థానంలో, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మూడో స్థానంలో నిలిచారు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టిన ప్రియాంక ఇప్పుడు పార్లమెంట్ కు ఎన్నిక కావటంతో కొత్త పాత్ర పోషించనున్నారు. 2019 జనవరిలో ప్రియాంక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి పార్టీ గెలుపు కోసం పార్లమెంట్, అనేక రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారానికే పరిమితం అయ్యారు.
ఇప్పుడు రాహుల్ రాజీనామాతో ఖాళీ అయిన వాయనాడ్ లో గాంధీ కుటుంబం పట్టు కొనసాగించే ఆలోచనతో పోటీ చేసారు. వాయనాడ్ ప్రజలు సైతం గాంధీ కుటుంబం పై తమ అభిమానం మరో సారి చాటుకున్నారు. ఈ విజయం తో వాయనాడ్ గాంధీ కుటుంబం అడ్డగా మారింది. కొద్ది నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్లో నుంచి సీపీఐ నాయకురాలు అన్నీ రాజాపై 3.64 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇప్పుడు ప్రియాంక ఆ మెజార్టీని అధిగమించి కొత్త రికార్డు నెలకొల్పారు. ఇక, ఇప్పుడు తల్లి సోనియా రాజ్యసభ సభ్యురాలిగా.. సోదరుడు రాహుల్ లోక్ సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇప్పడు ఆ ఇద్దరితో కలసి పార్లమెంట్ కు వెళ్లనున్న ప్రియాంక లోక్ సభలో రాహుల్ కు తోడుగా నిలవనున్నారు.
Author: VS NEWS DESK
pradeep blr