Search
Close this search box.

11 మంది ముస్లిం అభ్యర్ధుల్ని ఓడించిన ఏకైక హిందూ అభ్యర్ది-పెను సంచలనం..!

యూపీ అసెంబ్లీలో ఖాళీ అయిన 9 సీట్లకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. వీటిలో బీజేపీ మెజార్టీ సీట్లు గెల్చుకుంది. అయితే కుందర్కి సీటులో మాత్రం ఓ సంచలనం నమోదైంది. ముస్లిం ప్రాబల్యమున్న కుందర్కి సీటులో బీజేపీ హిందూ అభ్యర్ధిని బరిలోకి దింపింది. ఆయన మినహా మిగిలిన వారంతా ముస్లిం అభ్యర్ధులే. అలా 11 మంది ముస్లిం అభ్యర్ధులతో జరిగిన పోరులో హిందూ అభ్యర్ధి రామ్ వీర్ ఠాకూర్ సంచలన విజయం సాధించారు.

వాస్తవానికి కుందర్కీ సీటులో బీజేపీ గెలిచి మూడు దశాబ్దాలవుతోంది. ఎలాంటి ఆశల్లేని పరిస్ధితుల్లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్న కుందర్కీ సీటులో బీజేపీ రామ్ వీర్ ఠాకూర్ అనే ఓ అభ్యర్ధిని తెచ్చి నిలబెట్టింది. అయితే ఈసారి ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమనే అంతా ఓ అంచనాకు వచ్చేశారు. కానీ 11 మంది ముస్లిం అభ్యర్ధులతో పోటీ పడిన ఆయన.. ఏకంగా 1.4 లక్షల ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు.

సమాజ్ వాదీ పార్టీకి గట్టి పట్టున్న ఈ సీటులో ఉపఎన్నికల్ని ఈసీ మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి నిర్వహించింది. బీజేపీ ఇక్కడ చివరి సారిగా 1993లో గెలిచింది. కుందర్కిలో బీజేపీకి చెందిన రాంవీర్ ఠాకూర్ తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ధి మహ్మద్ రిజ్వాన్ పై ఏకపక్షంగా గెలిచారు. పశ్చిమ యూపీలోని సంభాల్ లోక్‌సభ స్థానంలో భాగమైన కుందర్కిలో ముస్లిం జనాభా ఏకంగా 60 శాతం ఉంది. అయినా మిగతా అభ్యర్ధుల మధ్య ఓట్ల చీలిక రామ్ వీర్ కు లాభించింది.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು