Search
Close this search box.

మీ ప్రేమ అసమానం: మహా విజయంపై ప్రధాని మోడీ ట్వీట్

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఐక్యంగా ముందుకు సాగితే భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించగలమని అన్నారు. ఈ విజయాన్ని అందించిన మహారాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా మహిళలు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోడీ.

మీరు చూపిన ప్రేమ అసమానమైదని అన్నారు. మహారాష్ట్ర అభ్యున్నతికి మహాయుతి కృషి చేస్తుందని హామీ ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మరోవైపు, క్షేత్రస్థాయిలో నిర్విరామంగా కృషి చేసిన కార్యకర్తల పట్ల గర్వంగా ఉందన్నారు. వారు ప్రజల మధ్యకు వెళ్లి, అధికార కూటమి సుపరిపాలన గురించి వివరించారని తెలిపారు. ఇక, జార్ఖండ్‌లో విజయం సాధించిన జేఎంఎం కూటమికి ప్రధాని మోడీ అభినందనలు తెలియజేశారు.

PM Modi tweets on Mahayuti s victory in Maharashtra

కాగా, మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి అద్భుత విజయం సాధించిన విషయంతెలిసిందే. 288 అసెంబ్లీ స్థానాలకు గానూ 221 సీట్లను కైవసం చేసుకుంది. మరో 8 చోట్ల ఆధిక్యంలో ఉండటం గమనార్హం. ఇక, విపక్ష కూటమి ఎంవీఏ(కాంగ్రెస్, ఎన్సీపీ-శరద్ పవార్, శివసేన-ఉద్ధవ్ థాక్రే) ఏమాత్రం పోటీనివ్వలేక చతికిలపడింది. ఇప్పటి వరకు 45 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 10 చోట్ల ఆధిక్యంలో ఉంది.

మరోవైపు, మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు. కాంగ్రెస్ కూటమిపై విమర్శలు గుప్పించారు. భ్రమలు, అబద్ధాల సాయంతో రాజ్యాంగాన్ని కాపాడతామంటూ బూటకపు మాటలు చెప్పేవారి కుట్రలను మహారాష్ట్ర ఓటర్లు భగ్నం చేశారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో అభివృద్ధితోపాటు సంస్కృతిని, దేశాన్ని ఉన్నతంగా నిలిపేందుకు కృషి చేసే మహాయుతికి ప్రజలు పట్టం కట్టారని ప్రశంసించారు.

ఎన్నికల్లో మహాయుతి విజయం.. ప్రధాని మోడీపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని చాటాయన్నారు అమిత్ షా. ఈ గెలుపు రాష్ట్ర అభివృద్ధికి మరింత సహకారం అందిస్తుందన్నారు. చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన మహారాష్ట్ర ప్రజలకు అమిత్ షా ఎక్స్ వేదికగా మరోసారి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు, జార్ఖండ్ ఫలితాలపై అమిత్ షా స్పందిస్తూ.. రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఆదివాసుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు, వారి గుర్తింపును కాపాడేందుకు బీజేపీ చొరవ చూపుతుందన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ఆ దిశగా కృషి చేస్తుందన్నారు. ప్రతిపక్ష స్థానంలో ఉండి రాష్ట్ర ప్రజల హక్కులు కాపాడుతుందని అమిత్ షా పేర్కొన్నారు.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು