Search
Close this search box.

బీజేపీని గెలిపించిన ఆరెస్సెస్ – మోదీకి అండగా, ఇక దేశ వ్యాప్తంగా..!!

మొన్న హర్యానా. నేడు మహారాష్ట్ర. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అనూహ్య విజయం వెనుక సంఘ్ పరివార్ ఆరెస్సెస్ సమర్ధవంతంగా పని చేసింది. జమిలి దిశగా మోదీ అడుగులు వేస్తున్న వేళ ప్రతీ చోట విజయమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేస్తోంది. స్థానిక అంశాలకే ప్రాధాన్యత ఇస్తూ ప్రతీ గడపకు వెళ్తూ బీజేపీ కూటమి విజయం వెనుక క్రియా శీలకంగా వ్యవహరించింది. ఇక, ఈ పరివార్ మోదీ కోసం.. బీజేపీ విజయం కోసం దేశ వ్యాప్తంగా ఇదే తరహా ఆపరేషన్ కు సిద్దమవుతోంది.

బీజేపీ కోసం ఆరెస్సెస్
హర్యానాలో బీజేపీ గెలుపు కోసం పని చేసిన ఆరెస్సెస్ మహారాష్ట్రలోనూ తెర వెనుక ఒక సైన్యం తరహాలో పని చేసింది. హర్యానాలో మూడ్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందని సర్వే సంస్థలు అంచనా వేసాయి. కాంగ్రెస్ గెలుపు ఖాయమని అన్ని పార్టీలు భావించాయి. కానీ, అక్కడే ఆరెస్సెస్ రంగంలోకి దిగింది. హర్యానాలో ఫలితం మార్చేసింది. బీజేపీకి హ్యాట్రిక్ విజయం అందించింది. ఇక, మహారాష్ట్ర ఆరెస్సెస్ కు పుట్టిల్లు. అక్కడ బీజేపీ కూటమి గెలుపుకు ఆరెస్సెస్ కార్యకర్తలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సీట్ల సర్దుబాటు.. ప్రజల అవసరాలు.. మేనిఫెస్టో.. ప్రచారం అన్ని విషయాల్లోనూ మహాయుతి కి కావాల్సిన సమాచారం ఇచ్చింది.

RSS played a Crcical role in Mahayuti s victory details here

ప్రతీ గడపకు – ప్రతీ ఓటరుకు
అదే సమయంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్.. సామాజిక వర్గాల సమావేశాలు.. ప్రాంతీయ భేటీలు నిర్వహించింది. స్థానిక అంశాలు.. మహాయుతి ఇచ్చే ప్రాధాన్యతలను బలంగా వారిలోకి తీసుకు వెళ్లింది. యువత, మహిళలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. బీజేపీ కూటమి అధికారం లోకి వస్తే దక్కే ఉపాధి గురించి వివరించింది. మేనిఫెస్టోలో మహిళలకు ప్రకటించిన వరాల గురిం చి ప్రతీ ఇంటికి వెళ్లి వారికి అర్దమయ్యేలా చెప్పింది. ప్రతీ గ్రామంలోని ప్రతీ ఓటరును కలిసేలా ప్రణాళికా బద్దంగా వ్యవహరించింది. అయిదు నుంచి పది మంది వరకు ప్రతీ చౌరస్తాలో కలిసి వారికి మహాయుతి గెలుపు ఆవశ్యకతను వివరించి వారి మద్దతు పొందటంలో సక్సెస్ అయింది. బీజేపీ నాయకత్వానికి గ్రౌండ్ లో పరిస్థితులు.. ప్రత్యర్దుల బలాబలాల గురించి ఎప్పటికప్పుడు నివేదికలు అందించి..సరి దిద్దుకునేలా సహకరించింది.

నాడు హర్యానా – నేడు మహారాష్ట్ర
పోలింగ్, ఫలితాలకు ముందే అరెస్సెస్ మహారాష్ట్రలో సర్వే చేసింది. ఆ సర్వేలో బీజేపీ కూటమి 200 సీట్లకు పైగా సాధిస్తుందని అంచనా వేసింది. బీజేపీ 100 సీట్లకు పైగా గెలుస్తుందని నివేదిక లో స్పష్టం చేసింది. మిత్రపక్షాలుగా ఉన్న అజిత్ పవార్ ఎన్సీపీకి 25-30 స్థానాలు, షిండే శివసేనకు 40-45 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని లెక్కలు తేల్చారు. ఏ ప్రాంతంలో బీజేపీకి అనుకూల – వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయనేది ఈ సర్వేలో ఆరెస్సెస్ నేతలు గుర్తించి నివేదిక ఇచ్చారు. ఆ నివేదికతో బీజేపీ అలర్ట్ అయింది. పొరపాట్లు..వ్యతిరేకతలను సరి చేసుకుంది. దీంతో, అనూహ్య ఫలితం సాధించింది. ఇప్పుడు ఆరెస్సెస్ హర్యానా, మహారాష్ట్ర తరహాలోనే దేశంలో ఎక్కడ ఎన్నిక జరిగినా రంగంలోకి దిగేలా కార్యాచరణ సిద్దం అవుతోంది.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು