Search
Close this search box.

శబరిమల ఆలయంలో అపచారం- పవిత్ర 18 మెట్లపై ఫొటోషూట్ !!

Sabarimala: కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో తరలి వెళ్తోన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మాలధారణ చేస్తోన్నారు. నియమ నిష్ఠలతో మణికంఠుడిని కొలుస్తోన్నారు.

మండలం-మకరవిళక్కు మహాపడి పూజల కోసం అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు ఈ నెల 15వ తేదీన తెరచుకున్న విషయం తెలిసిందే. దీనితో మండలం- మకరవిళక్కు సీజన్ ఆరంభమైంది. స్వామివారిని దర్శించుకోవడానికి ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలి వెళ్తోన్నారు.

శబరిమల ఆలయం అనగానే అక్కడ ఉండే 18 మెట్లు గుర్తుకు వస్తాయి. మాల ధారణ చేసి, కఠోర నియమ నిష్ఠలను పాటించి, ఇరుముడి కట్టుకుని వచ్చిన భక్తులకు మాత్రమే ఈ 18 మెట్లు అధిరోహించే అర్హత ఉంటుంది. సాధారణ భక్తులు ఈ మెట్లు ఎక్కడానికి అనుమతి లేదు.

ఈ 18 మెట్లను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు భక్తులు. వాటిని పదునెట్టంబాడిగా పిలుస్తారు. భక్తి ప్రపత్తులతో పూజిస్తారు. తొలి అయిదు మెట్లను పంచేంద్రియాలతో సమానంగా భావిస్తారు. ఆ తరువాతి ఎనిమిది మెట్లు కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్య, అలసత్వాన్ని సూచిస్తాయని నమ్ముతారు.

చివరి మూడు మెట్లు సత్వ, తమో, రజో గుణాలు, చివరి రెండు మెట్లు విద్య, అవిద్యను సూచిస్తాయి. ఆ 18 మెట్లను అధిరోహించి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం వల్ల వాటన్నింటిని త్యజించినట్టవుతుందని భక్తులు విశ్వసిస్తారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పదునెట్టంబాడపై పోలీసులు గ్రూప్ ఫొటో దిగడం వివాదానికి కేంద్రబిందువు అయంది.

సన్నిధానం వద్ద భక్తుల భద్రత కోసం నియమించిన పోలీసులు ఈ 18 మెట్లపై నిల్చుని ఫొటో దిగారు. ఆ సమయంలో వాళ్లంతా యూనిఫాంలో ఉన్నారు. అయ్యప్ప స్వామికి వ్యతిరేక దిశలో నిల్చుని ఫొటో దిగడం ఆలయ సంప్రదాయాలకు పూర్తి విరుద్దమంటూ భక్తులు మండిపడుతున్నారు.

దీనిపై ఆన్ మనోరమ ఓ కథనాన్ని ప్రచురించింది. అదనపు డిజీపీ శ్రీజిత్ స్పందించినట్లు తెలిపింది. ఈ ఘటనపై సమగ్ర నివేదికను అందజేయాల్సిందిగా సన్నిధానం ప్రత్యేక అధికారిని ఆదేశించినట్లు పేర్కొంది. ఈ ఘటన పట్ల విశ్వహిందూ పరిషత్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు వీజీ థంపి, ప్రధాన కార్యదర్శి వీఆర్ రాజశేఖరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು