సాయిరెడ్డికి షాకిచ్చిన ఈడీ: వైవీ సుబ్బారెడ్డి కుమారుడికీ..!!

Vijayasai Reddy: ఆర్థిక నేరాల మీద విచారణ నిర్వహించడానికి ఏర్పాటైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులకు షాకిచ్చింది. వీ విజయసాయి రెడ్డి, ఆయన వియ్యంకుడు, అరబిందో ఫార్మా పీ శరత్ చంద్ర రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వై విక్రాంత్ రెడ్డికి నోటీసులను జారీ చేసింది. మరో ఇద్దరికీ నోటీసులు అందాయి.

కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కర్నాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇదివరకే ఏపీ సీఐడీ అధికారులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసుపై ఈడీ రంగంలోకి దిగింది. సాయిరెడ్డి, విక్రాంత్ రెడ్డి, శరత్‌చంద్ర రెడ్డితో పాటు మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ పాల్పడినట్లు ఆరోపణలు రావడం వల్ల ఈడీ రంగ ప్రవేశం చేసింది.

ఈ ఏడాది మేలో 2,500 కోట్ల రూపాయల మేర విలువ చేసే కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్ షేర్లను బలవంతంగా కర్నాటి వెంకటేశ్వరరావు నుంచి తమ పేర్ల మీద బదలాయించుకున్నారనేది వాళ్లపై ఉన్న ప్రధాన ఆరోపణ. సీపోర్ట్ లిమిటెడ్ షేర్ల విలువ మొత్తం 2,500 కోట్ల రూపాయలుగా కాగా వాటిని 494 కోట్లకు, సెజ్ షేర్ల విలువ 1,109 కోట్లు వాటిని అతి తక్కువ ధరకు అరబిందో ఫార్మా అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదలాయించుకున్నారని చెబుతున్నారు.

ఈ విషయంలో ఏపీ సీఐడీ ఇదివరకే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ షేర్ల బదలాయింపులో భారీ ఎత్తున మనీ లాండరింగ్ చోటు చేసుకున్నట్లు తేలడం వల్ల ఈడీ కూడా ఎంట్రీ అయింది. ఇదివరకే వాళ్లను విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ పార్లమెంట్ సమావేశాల వల్ల సాయిరెడ్డి, అనారోగ్య కారణాల వల్ల విక్రాంత్ రెడ్డి వెళ్లలేకపోయారని అంటున్నారు.
VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr