Soniya Akula: బిగ్‎బాస్ బ్యూటీ సోనియా ఆకుల పెళ్లి .. ఎక్కడా కనిపించని ఆ ఇద్దరూ..

బిగ్‌బాస్ బ్యూటీ సోనియా ఆకుల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు యష్ వీరగోనితో కలిసి పెళ్లి పీటలెక్కింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో సోనియా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. వీరికి పెళ్లికి బిగ్‌బాస్ కంటెస్టెంట్స్, మాజీ కంటెస్టెంట్స్ హాజరయ్యారు.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది సోనియా ఆకుల. అంతకు ముందు డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన ఒకటి రెండు చిత్రాల్లో నటించింది. దీంతో అదే గుర్తింపుతో బిగ్‌బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టింది. ఈ షోలో మొదటి వారంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నిరూపించింది. తన ఆట తీరు, ప్రతి విషయంలో ప్రశ్నించే తీరుతో ఆమె పేరు నెట్టింట మారుమోగిపోయింది. దీంతో సోనియా టాప్ 5 కంటెస్టెంట్ అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత నిఖిల్, పృథ్వీలతో స్నేహం చేయడంతో ఆమెపై విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది. దీంతో నాలుగో వారంలోనే బయటకు వచ్చేసింది. హౌస్‏లో ఉన్నప్పుడు తన ప్రియుడు యష్ గురించి బయటపెట్టింది. తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది సోనియా ఆకుల. తన ప్రియుడు యష్ వీరగోనితో కలిసి ఏడుగులు వేసింది.

వీరిద్దరి వివాహం శుక్రవారం గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్, మాజీ కంటెస్టెంట్స్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలను జబర్దస్త్ రోహిణి తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అందులో జెస్సీ, అమర్ దీప్, తేజస్విని, బేబక్క, రోహిణి, టేస్టీ తేజ, కిర్రాక్ సీత కనిపించారు. అయితే సోనియా ఆకుల పెళ్లి వేడుకలో మాత్రం నిఖిల్, పృథ్వీ మాత్రం కనిపించలేదు. దీంతో ఆ ఇద్దరు ఎందుకు రాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

బిగ్‌బాస్ రియాల్టీ షో ద్వారా సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయ్యింది సోనియా ఆకుల. హౌస్ లో ఉన్నప్పుడు తనపై వచ్చిన నెగిటివిటీపై గట్టిగానే రియాక్ట్ అయ్యింది సోనియా. అంతేకాదు.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూలలో బిగ్‌బాస్ షో హోస్ట్ నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే నిఖిల్, పృథ్వీలతో తనకున్న బాండింగ్ పై సైతం క్లారిటీ ఇచ్చింది. అలాగే తన ప్రియుడు యష్ వీరగోనితో ప్రేమ, పెళ్లి గురించి కూడా బయటపెట్టింది.

 

 

 

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr