సీఎం రేవంత్ కు కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత అల్టిమేటం!

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పుడిప్పుడే రాజకీయాలలో తన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత అల్టిమేటం జారీ చేశారు. బీసీ సమస్యలపై ఉద్యమ బాటకు సిద్ధమవుతున్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఈ మేరకు ఒక కీలక ప్రకటన విడుదల చేశారు.

నేడు తన నివాసంలో బీసీ సంఘాల నాయకులతో సమావేశమైన కవిత స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలని ఎత్తిచూపుతూ బిసి కులగణన వివరాలు వెల్లడించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలు నిర్వహించటానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ హామీని గుర్తు చేసిన కవిత
బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు జరపడానికి వీలులేదని బీసీల జనాభా ఎంత ఉందో తెలియకుండానే హామీ ఎలా ఇస్తారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో హామీ ఇచ్చిందని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.

ఆ పని చెయ్యకుంటే ఎన్నికలు జరగనివ్వం
ఇక ఇదే సమయంలో అసలు జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారని అయితే కాంగ్రెస్ 42 శాతం రిజర్వేషన్లను ఎలా చెబుతుందో అంతు పట్టడం లేదన్నారు. రిజర్వేషన్లు పెంచి తీరాల్సిందేనని, రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు జరగనివ్వమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లను కల్పించకుండానే ఎన్నికలు నిర్వహిస్తారా అంటూ ప్రశ్నించారు.

కేంద్రానికి కవిత డిమాండ్
బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత బీసీల జనాభాను వెల్లడించిన తర్వాతనే ఎన్నికలపై ఆలోచన చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. జనాభా లెక్కలలో కుల గణన చేపట్టాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

ఇందిరా పార్కు వద్ద భారీ సభ
సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3వ తేదీన ఇందిరా పార్కు వద్ద భారీ సభను నిర్వహిస్తామని కవిత ప్రకటించారు. బీసీలకు ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పిందని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr