దేవుడి సాక్షిగా రక్తార్పణం..!!

ప్రతీ ఏటా దసరా వేళ దేవరగట్టుకు ఒక ప్రత్యేక ఉంది. ఈ సారి అదే జరిగింది. ఫలితం 70 మంది తలలు పగులాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు వద్దని చెప్పినా.. భారీగా బలగాలు మొహరించినా కర్రల సమరం కొనసాగింది. బన్నీ జైత్రయాత్ర పేరుతో భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకున్నారు. రక్తార్పణం చేసారు.

పగిలిన తలలు

దేవరగట్టు లో శ్రీ మాల మల్లేశ్వర స్వామి మల్లమ్మల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు ఉత్సవ మూర్తులను కొండ మీద ఆలయం నుంచి కిందకు తీసుకొచ్చారు. బన్నీ జైత్రయాత్ర సింహాసనం కట్ట వద్ద నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో భక్తులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు భక్తులు కర్రలతో కొట్టుకున్నారు. బందోబస్తుకు వచ్చిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. జైత్రయాత్రలో అల్లరి మూకలు కాగడాలు పైకి విసిరారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.కర్రల సమరం
పోలీసులు వద్దని చెప్పినా వినలేదు.. యథావిధిగా కర్రల సమరం కొనసాగింది. చాలా మంది తలలు పగిలాయి. రక్తం కారుతున్నా వెనక్కి తగ్గలేదు. దేవుణ్ని దక్కించుకునేందుకు భీకరంగా పోరాటం చేశారు. ఒకరిపై ఒకరు

అగ్గి దివిటీలను విసురుకుని దేవరగట్టు నేలను రక్తంతో తడిపారు.

మనుషుల రక్తంతో మాలమల్లేశ్వరస్వామికి రక్తతర్పణ జరిగిపోయింది. సాధారణంగా కొట్లాట జరిగితే ఎవరికైనా ఆందోళన ఉంటుంది. కానీ అక్కడ ఆనందం తాండవిస్తుంది. కొట్టుకుంటే ఎవరైనా ఆపాలని ప్రయత్నిస్తారు.. కానీ అక్కడ ఎంత కొట్టుకుంటే అంత ఉత్సాహం. ఈ సమరాన్ని చూసేందుకు ఏపీ నుంచే కాకుండా, కర్ణాటక నుంచీ భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు.పోలీసులు చెప్పినా
దేవరగట్టు 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిసరాల్లో విద్యుత్‌ దీపాలు, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కర్రల సమరాన్ని అడ్డుకునేందుకు పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం చేసిన ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. కర్రల సమరం వద్దని కొన్ని రోజులుగా అవగాహన సదస్సులు నిర్వహించినా.. భక్తులు మాత్రం తమ వెంట పెద్దఎత్తున కర్రలు పట్టుకొని వచ్చారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. అయితే, ఇదంతా తమ సంప్రదాయమని గ్రామస్థులు ఇప్పటికీ చెబుతున్నారు.

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು