టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు గుడ్ న్యూస్ అందించనున్నాడా అంటే అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. రోహిత్ శర్మ మరోసారి తండ్రి కాబోతున్నాడని క్రికెట్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని రోహిత్ శర్మ అఫిషియల్‌గా చెప్పనప్పటికీ, భార్య రితికను చూసిన వారందరూ కూడా ఈ జంట రెండోసారి తల్లిదండ్రులుగా మారబోతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. రితికను చూస్తే ఆమె ప్రెగ్నెంట్ అని ఈజీగా తెలిసిపోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.రితిక ఇటీవల ఓ వీడియోలో సందడి చేశారు. ఈ వీడియోలో రితిక బేబీ బంప్‌తో కనిపించారు.
దీంతో రోహిత్ శర్మ రెండోసారి తండ్రి కాబోతున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు త్వరలోనే జూనియర్ హిట్ మ్యాన్ మన ముందుకు రాబోతున్నడంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న మొదటి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాల వలన అందుబాటులో ఉండనని రోహిల్ శర్మ ఇప్పటికే బీసీసీఐ కి సమాచారం ఇచ్చారు. దీంతో భార్య రితిక ప్రెగ్నెంట్ కావడం వల్లనే రోహిత్ శర్మ మొదటి రెండు టెస్టులకు దూరంగా ఉంటున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే రితిక ప్రెగ్నెంట్ గురించి వస్తోన్న వార్తలపై రోహిత్ శర్మ కానీ ఆయన ఫ్యామిలీ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.ఈ విషయంలో రోహిత్ శర్మ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. రోహిత్ శర్మ రితికా సజ్దేను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు రితికా స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్‌గా పనిచేసేవారు. రోహిత్ శర్మ, రితికా సజ్దేలు తొలుత స్నేహితులుగా మారారు. ఆ తర్వాత వారి స్నేహం ప్రేమగా మారింది. దీంతో ఈ జంట 2015లో ఒకటైయ్యారు. వీరికి సమైరా అనే ఒక కుమార్తె కూడా ఉంది. ఇక రోహిత్ శర్మ నాయకత్వంలోనే టీ 20 వరల్డ్ కప్ భారత్ గెలుచుకుంది. టీ 20 కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ టీ 20 ఫార్మాట్ కు రిటైర్ మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం వన్డే, టెస్ట్ జట్టులకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు.