ఏపీ ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు తరువాత టీటీడీ బోర్డును ప్రకటించింది. బీఆర్ నాయుడు బోర్డు ఛైర్మన్ గా 29 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటు చేసింది. ఈ లిస్టు పైన కూటమిలోని పార్టీల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన నుంచి ముగ్గురికి అవకాశం ఇచ్చారు. బీజేపీ నుంచి ఏపీ నుంచి భాను ప్రకాశ్ రెడ్డికి మాత్రమే ఛాన్స్ దక్కింది. ఇక.. టీడీపీ నుంచి అవకాశం దక్కిన వారి పైన సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.
వారికి దక్కని ఛాన్స్
నూతనంగా నియమించిన టీటీడీ పాలక మండలి ఈ నెల 6న ప్రమాణ స్వీకారం చేయనుంది. ఛైర్మన్ గా బీఆర్ నాయుడుతో సహా సభ్యులు అందరూ ఒకే రోజున బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక, బోర్డులో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, తుడా ఛైర్మన్, టీటీడీ ఈవో లను ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమించారు. కానీ, తిరుపతి ఎమ్మెల్యేకు అవకాశం దక్కలేదు. ఇక, ఈ బోర్డులో అవకాశం దక్కిన వారి గురించి మూడు పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది. ప్రధానంగా చిత్తూరు జిల్లాకే చెందిన బీఆర్ నాయుడు ఛైర్మన్ గా నియమితులయ్యారు. కుప్పం నుంచి శాంతారామ్ కు అవకాశం కల్పించారు. పలువురు ముఖ్య నేతలు స్థానం ఆశించినా ఫలించలేదు.ఎంపిక తీరు పైనఈ సారి బోర్డులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వలేదనే వాదన వినిపిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఈ కోటాలో భర్తీ చేసామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీ నుంచి చిత్తూరు జిల్లాకు చెందిన నరసింహ యాదవ్, శ్రీధర్ వర్మ ఆశలు పెట్టుకున్నారు. అదే విధంగా జనసేన తిరుపతికి చెందిన నేతలు హరిప్రసాద్, తిరుపతి ఇన్ చార్జ్ కిరణ్ రాయల్ సైతం తమకు ఛాన్స్ వస్తుందని ఆశించారు. ఇక, బీజేపీ నుంచి కోలా ఆనంద్, గాలి పుష్ఫలత చివరి వరకు ప్రయత్నాలు చేసారు. కానీ, బీజేపీ నుంచి భాను ప్రకాశ్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వగా.. జనసేన, టీడీపీ ఆశావాహులకు మాత్రం నిరాశ మిగిలింది.ఏం చేయబోతున్నారు
జనసేన నుంచి ముగ్గురికి బోర్డులో అవకాశం దక్కింది. వారిలో ఆనంద్ సాయి పార్టీ కోసం ఏం పని చేసారనే ప్రశ్న మొదలైంది. మిగిలిన రెండు పదవులు సైతం తెలంగాణ జనసేన నేతలకు ఇవ్వటం ఏంటనే చర్చ వినిపిస్తోంది. ఏపీలో జనసేన కోసం పని చేసిన వారికి ఒక్కరికీ ఇవ్వక పోవటం వారికి రుచించటం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నుంచి ఒక్కరికే అవకాశం కల్పించారు. ఇక, కర్నూలు జిల్లా నుంచి టీడీపీ అవకాశం ఇచ్చిన వారితో పాటుగా మరో ఎమ్మెల్యే పైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో వైసీపీ హయాంలోనూ టీటీడీ సభ్యులుగా పని చేసిన ప్రశాంతి రెడ్డి, జంగా క్రిష్ణమూర్తికి తిరిగి అవకాశం దక్కింది. దీంతో, ఈ బోర్డు నియామకం ద్వారా వస్తున్న స్పందనతో ఇప్పుడు ఆశావాహులకు ఎలాంటి హామీ దక్కుతుంది.. తదుపరి నిర్ణయాలు ఏంటనేది ఆసక్తి కనిపిస్తోంది.
Author: VS NEWS DESK
pradeep blr