Search
Close this search box.

శుభవార్త: 3 నెలలకోసారి పెన్షన్ తీసుకోవడంపై చంద్రబాబు కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చారు. అంతేకాదు.. తానిచ్చిన మరో హామీని కూడా నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పింఛనుదారులు ప్రతినెలా ఒకటోతేదీన తమ పింఛను తీసుకుంటున్నారు. కొంతమందికి వేర్వేరు చోట్ల పింఛను ఉంటుంది. వేరే ప్రాంతాల్లో ఉంటున్నవారు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి కచ్చితంగా ఒకటోతేదీ లేదంటే రెండోతేదీన పింఛను తీసుకుంటున్నారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏనెలకు ఆ నెలే పింఛను తీసుకోవాలని, లేదంటే రద్దవుతుందనే నిబంధన తీసుకురావడంతో పింఛనుదారులకు తిప్పలు తప్పడంలేదు.

పాత విధానాన్ని పునరుద్ధరిస్తూ
ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ విధానాన్ని రద్దుచేశారు. వరుసగా రెండు నెలలు పింఛను తీసుకోకపోయినా మూడో నెలలో తీసుకోవచ్చని, మూడు నెలలది కలిపి రూ.12వేలు అందిస్తారని ప్రకటించారు. ఈమేరకు ఆయన అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో పింఛను ఇలాగే ఇచ్చేవారు. ఒకవేళ ఒక నెలలో తీసుకోలేకపోయినా తర్వాత నెలలో తీసుకునే వెసులుబాటు ఉండేది. దీన్ని జగన్ ప్రభుత్వం రద్దుచేయడంతో పింఛనుదారులంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇటీవలే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో పర్యటించిన సీఎం చంద్రబాబు పాత విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు.

ఈనెలలో తీసుకోనివారికి డిసెంబరులో..
నవంబరు నెలలో పింఛను తీసుకోలేనివారికి డిసెంబరులో అందజేయనున్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై పింఛనుదారులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో ఉండేవారు చాలామంది ఉన్నారు. ఒకటోతేదీ సమయంలో ముఖ్యమైన పనులు ఉండటంతో ప్రయాణాలపై వెళ్లేవారుంటారు. ఆస్పత్రులకు వెళ్లేవారు, ఇతర పనులపై ఉండేవారంతా ఆ సమయంలో పింఛను తీసుకోలేకపోతున్నారు. చంద్రబాబు పాత విధానాన్ని పునరిద్ధరిస్తూ హామీని నిలబెట్టుకోవడంతో వీరందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబు దీనిపై హామీ ఇచ్చారు. త్వరలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కూడా కల్పించబోతున్నారు. విధివిధానాలు ఖరారయ్యాక అతి త్వరలోనే ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయబోతోంది.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು