Search
Close this search box.

TTD: నాగుల చవితి వేళ తిరుమలలో ప్రత్యేక దర్శనం..!!

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దీపావళి, వరుస సెలవులతో గత మూడు రోజులు ఎక్కువగా ఉన్న రద్దీ క్రమేణా తగ్గుతోంది. కార్తీక మాసం ప్రారంభం కావటంతో ఈ నెలలో తిరుమల లో పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేపు (మంగళవారం) నాగుల చవతి వేళ తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారు ఉభ‌య‌ దేవేరుల‌తో క‌లిసి దర్శనమివ్వనున్నారు. అదే విధంగాతిరు నక్షత్రోత్సవాలు సైతం టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది.

నాగుల చవితి నాడు
తిరుమలలో నవంబరు 5వ తేదీన‌ నాగుల చవితి ప‌ర్వ‌దినం సందర్భంగా పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుండి 9 గంటలవరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభ‌య‌ దేవేరుల‌తో క‌లిసి దర్శనం ఇవ్వనున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నారు.

భక్తులకు అభయం
అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ వైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు, దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయ దేవేరులతో కూడి తిరువీధులలో విహరిస్తూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైవున్న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవాన్ని ప్రతిఏటా టిటిడి ఘనంగా నిర్వహిస్తుంది.

కైశిక ద్వాదశి
నవంబరు 13వ తేదీన కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది. వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. ఇటు, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సంవత్సరం పొడవునా అనేక ఉత్సవాలు నిర్వహించడమే కాకుండా, శ్రీవారి పరమ భక్తుల తిరు నక్షత్రోత్సవాలు కూడా టీటీడీ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తోంది. ఆదివారం తిరుమల నంబి శాత్తుమొర వైభవంగా జరిగింది.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು