సినిమాలో అవకాశం కోసం దర్శకుడు శంకర్‌కు పర్సనల్ ఫొటోలు పంపించిన తెలుగు హీరోయిన్

ఇప్పుడైతే ప్యాన్ ఇండియా సినిమాల ప్రస్తావనకు వస్తే దర్శక ధీరుడు రాజమౌళి గురించి చర్చించుకుంటున్నారు కానీ,గతంలో ప్యాన్ ఇండియా అనే పదానికే అర్థం తీసుకువచ్చిన దర్శకుడు ఎవరైన ఉన్నారంటే అది కచ్చింతంగా తమిళ దర్శకుడు శంకర్. వరుస హిట్లను సాధిస్తూ స్టార్ దర్శకుడుగా ఎదిగారాయన. ముఖ్యంగా రోబో సినిమాతో శంకర్ తన స్టామినా ఏంటో నిరూపించారు. అయితే ఆ తర్వాత వరుస ఫ్లాప్‌లతో శంకర్ ప్యాన్ ఇండియా రేసు నుంచి తప్పుకున్నారు.

ఇదిలా ఉంటే శంకర్‌కు ఓ తెలుగు నటి బికిని ఫొటోలు పంపించారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ నటి మరెవ్వరో కాదు కస్తూరి శంకర్. అన్నమయ్య సినిమాతో కస్తూరి శంకర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. కొంతకాలం నటనకు గ్యాప్ తీసుకున్న కస్తూరి శంకర్.. తిరిగి సీరియల్స్‌, వెబ్ సిరీస్‌లో నటిస్తూ బిజీగా ఆర్టిస్ట్‌గా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ ఇలా సౌత్‌లోని నాలుగు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పాటు, సీరియల్స్‌తో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది.

అయితే శంకర్ దర్శకత్వంలో కస్తూరి శంకర్ ఓ సినిమాలో నటించింది. ఆ సినిమా మరేదో కాదు. భారతీయుడు. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఎతంటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ చెల్లెలుగా కస్తూరి శంకర్ నటించారు. ఈ మూవీతోనే తమిళంలో కస్తూరికి మంచి బ్రేక్ దొరికింది. అయితే ఈ సినిమాలో తనకు ఎలా అవకాశం వచ్చిందో ఈ సీనియర్ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో సినిమా అంటే చాలా ఎగ్జైట్ అయిపోయి, ఎలాగైనా ఈ అవకాశం దక్కించుకోవాలని అనుకుందట.అందుకోసం ఆడిషన్ అయ్యాక శంకర్‌ను ఇంప్రెస్ చేయాలని తన బికిని ఫొటోలను పంపిందట. ఎలాగైనా తనే హీరోయిన్ అవ్వాలనుకుని అలా చేసిందట. కానీ అప్పుడే రంగీలా సినిమా రిలీజ్ అయి.. అందులో ఊర్మిళ బికిని ఫొటోలు పాపులర్ అయి అందరి దృష్టి ఆమె వైపు మళ్లిందని దీంతొో ఆ సినిమాలో హీరోయిన్‌గా కాకుండా తనను చెల్లెలి పాత్రకు ఓకే చేశారని చెప్పుకొచ్చింది. అలా బికినీ ఫోటోలు పంపితే చెల్లెలి క్యారెక్టర్‌కు ఎంపిక చేశారని ఈ బ్యూటీ గతంలో జరిగిన ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాలో మనీషా కోయిరాలను హీరోయిన్‌గా తీసుకున్నారు.

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು