Search
Close this search box.

అ‘శోక’ నగర్‌ను సందర్శించండి: రాహుల్, కాంగ్రెస్‌పై హరీశ్ రావు ఫైర్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్న క్రమంలో మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆయనపై విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు.

రాహుల్‌.. ఎన్నికల ముందు మీరు నిరుద్యోగ యువతను కలిసిన ప్రదేశంలోనే విద్యార్థులను మీ ప్రజా ప్రభుత్వం కొట్టిందని మీకు తెలుసా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. హైదరాబాద్‌కు వస్తున్న మీరు ఒకసారి అశోక్‌నగర్‌ను సదర్శించి ఆ విద్యార్థులతో మాట్లాడాలని, వారి ఆవేదను వినాలని, అ’శోక’ నగరంగా మార్చిన మీ ప్రభుత్వ తీరును చూడాలన్నారు. విద్యార్థులపై దాడికి సంబంధించిన పలు ఫొటోలను, వీడియోలను ఆయన పోస్టు చేశారు.మీరు (రాహుల్, కాంగ్రెస్) వాగ్దానం చేసిన 20 లక్షల ఉద్యోగాల్లో కనీసం 10 శాతం కూడా భర్తీ చేయలేదన్నారు హరీశ్ రావు. టీఎస్‌పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు.. ఆ సంగతి దేవుడెరుగు.. టీఎస్పీఎస్సీని టీజీపీఎస్‌గా పేరు మార్చి చేతులు దులుపుకున్నారని హరీశ్ రావు విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. కానీ అది కేవలం జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు హరీశ్ రావు. పది నెలల కాలంలో నిరుద్యోగ భృతి, యువ వికాసం కింద ఇస్తామన్న రూ.5 లక్షల వంటి హామీ ఖాళీ గ్యారంటీగా మారడంతో తెలంగాణ యువతకు అభద్రతాభావం ఏర్పడిందని వ్యాఖ్యానించారు.

నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల మీరు(రాహుల్), మీ పార్టీ(కాంగ్రెస్) చూపిన కపట ప్రేమ బట్టబయలైందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కర్కశ పాలనను నిరుద్యోగ యువత తప్పకుండా గుర్తుపెట్టుకుంటుందని హరీశ్ రావు అన్నారు.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು