ఏపీలో వరుస అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట మహిళలు, యువతులు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తాజాగా ఏపీలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుపతి జిల్లా , యలమంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కొత్త మాదిగ పల్లికి చెందిన మైనర్ బాలికపై ఇద్దరు దుండగులు దాడి చేసి, సామూహిక అత్యాచారం చేశారు.
సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న బాలికను స్కూటర్‌పై వచ్చి ఇద్దరు అగంతకులు, వాటర్ బాటిల్‌లో మత్తు మాత్రలు వేసి బలవంతంగా నీటిని తాగించి అత్యాచారం చేశారు. కూతురు ఇంటికి రాకపోవడంతో ఆరా తీసిన తల్లిదండ్రులకు ముళ్లపొదలలో నిర్జీవంగా పడి ఉన్న కూతుర్ని చూసి అక్కడిక్కడే కూప్పకూలిపోయారు. స్థానికులు హుటాహుటిన మైనర్ బాలికను ఆస్పత్రికి తరలించారు.యలమంద ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికకు చికిత్స అందిస్తున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు , బాలికను విచారిస్తున్నారు.తాజాగా ఈ ఘటనపై మాజీ మంత్రి రోజా స్పందించారు. బాధితురాల్ని ఆస్పత్రి వెళ్లి మరీ పరామర్శించారామె. అనంతరం మీడియాలో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో 120 రోజుల్లో 110 ఘటనలు జరిగాయని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్రంలో లా అండ్ అర్డర్ సరిగా లేదని ఏకంగా డిప్యూటీ సీఎం చెబుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని రోజా అభిప్రాయపడ్డారు.స్కూల్ నుంచి వస్తున్న అమ్మాయికి మత్తు మందు ఇచ్చి లైంగికదాడి జరిగిన ఘటన అమానవీయం ఆమె అన్నారు.
పిఠాపురంలో ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే ప్రభుత్వం తరుఫున కనీసం ఏ ఒక్కరు కూడా పలకరించలేదని ఆమె విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే మంత్రి నారా లోకేష్ విదేశాల్లో తిరుగుతున్నారని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు.
ఇప్పటికైనా తమను ఇబ్బంది పెట్టే పనులు మానుకుని పరిపాలన మీద దృష్టి పెట్టాలని కూటమి ప్రభుత్వానికి రోజా సూచించారు.ఇక రాష్ట్ర హోంమంత్రి అనిత డమ్మీ అని మండిపడ్డారు. ఆమె పనికూడా లోకేష్ చేస్తున్నారని ఆరోపించారు. సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఓ బాలికపై అత్యాచారం జరిగితే గొల్లప్రోలుకు వెళ్లి హోంమంత్రిని తిట్టిన పవన్..
బాధిత కుటుంబాన్ని మాత్రం పరామర్శించలేదని రోజా గుర్తు చేశారు.ఈ ప్రభుత్వంలో మహిళల భద్రతకు రక్షణ లేదని .. ఇన్ని జరుగుతున్నాయంటే ఇందుకు కారణం ఎటు చూసినా బెల్టు షాపులే ఉండటమని వ్యాఖ్యానించారు.
Author: VS NEWS DESK
pradeep blr