Comprehensive Caste Census: తెలంగాణ ప్రజలు ఎప్పుడేప్పుడని ఎదురు చూస్తున్న సమగ్ర కుటుంబ సర్వే రేపటి నుంచే ప్రారంభం కానుంది. ఈ సర్వేతో తెలంగాణ ప్రజలకు మేలు జరగుతుందని ప్రభుత్వం చెబుతోంది. మరి, సర్వేలో అధికారులు ఏం అడగనున్నారు అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు
Comprehensive Caste Census: తెలంగాణ ప్రజలు ఎప్పుడేప్పుడని ఎదురు చూస్తున్న సమగ్ర కుటుంబ సర్వే రేపటి నుంచే ప్రారంభం కానుంది. ఈ సర్వేతో తెలంగాణ ప్రజలకు మేలు జరగుతుందని ప్రభుత్వం చెబుతోంది. మరి, సర్వేలో అధికారులు ఏం అడగనున్నారు అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ప్రక్రియతో దేశం మెుత్తం రాష్ట్రం వైపు చూసేలా ప్రణాళికలు రచించింది. పైగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనాయకులు మాట ఇవ్వడంతో పకడ్బందీగా ముందుకు వెళ్తోంది. అందుకోసం అనుభవం ఉన్న ఉన్నత స్థాయి అధికారులను పూర్తి స్థాయిలో వినియోగించనుంది. ఇప్పటికే అందుకు అనుగుణంగా అధికారులను సన్నద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి రేపటి నుంచి జరిగే ఇంటింటి సర్వేలో ఎంత మంది సిబ్బంది పాల్గొంటున్నారు.విధులు ఎలా నిర్వహిస్తారు.. మెుత్తంగా ఖర్చు ఎంత అవ్వనుంది.. ఏ శాఖ నిధులు ఖర్చు చేయనున్నారు… ఇప్పుడు తెలుసుకుందాం….
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ కీలక సర్వేలో 36,549 మంది ఎస్‌జీటీలు, 3,414 మంది ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లు పాల్గొంటారు. అలాగే 6,256 మంది MRCs, 2 వేల మంది మినిస్టీరియల్ సిబ్బంది సైతం కార్యక్రమంలో సర్వేలో భాగం అవుతారని తెలుస్తుంది. అయితే మెుదట ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్లకు మినహాయింపు ఇచ్చారు. కానీ, సర్వేకు ఎక్కువ మంది అధికారులు అవసరం కావడంతో ఆ ఉపాధ్యాయులను కూడా పూర్తి స్థాయిలో వినియోగించనుంది ప్రభుత్వం. మెుత్తంగా 80 వేల మందికిపైగా సిబ్బంది, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక వీరంతా సెలవు రోజులు, ఆదివారాలు కూడా అని చేయాల్సి ఉంటుందని సమాచారం.
సర్వే సిబ్బందికి గత 2 నెలల నుంచి శిక్షణ ఇవ్వడం.. మార్గదర్శకాలు చేయడం జరిగింది. సర్వే చేసే సిబ్బందికి ముందుగానే సంబంధిత అధికారులు వివరాలు ఇస్తారు. వాటి ఆధారంగా ఒక్కో ఇంటికి వెళ్లి… ప్రభుత్వానికి కావాల్సిన వివరాలు సేకరిస్తారు. ఈ ప్రక్రియ జరిగే సమయంలో ఇంటి యాజమాని ఒక్కరు ఉండే సరిపోతుందని ఓ సర్వే అధికారి తెలిపారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో అడిగే ప్రశ్నలను 2 విభాగాలుగా విభజించారు. మెుదటి విభాగంలో కుటుంబ యజమానితోపాటు ఇంటి సభ్యుల వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. రెండోవ విభాగంలో కుటుంబ పూర్తి వివరాలు తీసుకుంటారు. ఈ ప్రక్రియలో మెుత్తం గా 56 ప్రశ్నలను సర్వే అధికారులు మనల్ని అడుగుతారు.
సర్వే సిబ్బందే ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తుండటంతో వివరాలు గోప్యతతోపాటు ఖచ్చితత్వంతో ఉంటాయని ప్రభుత్వాం భావిస్తోంది.
ఎన్ని కోట్ల ఖర్చు…
రాష్ట్రంలోని SC,ST,BC ఇతర బలహీన వర్గాల్లో విద్య, ఉపాధి, సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలు పెంచేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అసెంబ్లీలో చేసిన తీర్మానం మేరకు దాదాపుగా రూ.150 కోట్ల ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రభుత్వం అంచనాగా తెలిపింది. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మార్చిలో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ నిధుల వివరాల అంశం ఉంది.
అడిగే ప్రశ్నలు…
సమగ్ర సర్వేలో మెుదటగా ఇంటి యాజమాని పేరు, కుటుంబ సభ్యుల వివరాలు అడుగుతారు. అలాగే యాజమానితో కుటుంబ సభ్యులకు ఉన్న సంబంధం తెలపాల్సి ఉంటుంది. ఆ తర్వాత వయసు, జెండర్, మతం, కులం, ఉపకులం, మాతృభాష, వైవాహిక స్థితి, దివ్యాంగులు వంటి ప్రాథమిక వివరాలు సేకరిస్తారు. వీటితో పాటు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు నంబర్, ఫోన్ నంబర్ లను సేకరించనున్నారు. అలాగే విద్యార్హత, ఉపాధి వివరాలు, కుటుంబ సభ్యుల భూ వివరాలు, రిజర్వేషన్, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు వంటి అంశాలను సర్వే సిబ్బంది అడుగుతారు. వలస వెళ్లారా, బుుణం తీసుకున్నారా, రేషన్ కార్డు వివరాలు, ఇంటి స్థితిగదులు వంటి కీలక అంశాలను తెలుకుంటారు.
సమగ్ర కుటుంబ సర్వేలోనే కుల, ఉపకులం వంటి వివరాలను సేకరిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. తద్వారా రాష్ట్రంలో ఏ కులం జనాభా ఎంత ఉంది అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రత్యేక కమీషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమీషన్ ఛైర్మన్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వేంకటేశ్వరరావును ప్రభుత్వం ఇటీవలె నియమించింది. కమీషన్ ఏర్పాటు చేస్తూ బీసీ కలగణనపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన రిజర్వేషన్ అమలు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక చేస్తోంది.
రైతు భరోసా ఖర్చు తగ్గింపు..
సమగ్ర సర్వేలో భూ వివరాలు కూడా సర్వే సిబ్బంది నమోదు చేసుకుంటారు. అందువల్ల ప్రతి కుటుంబానికి ఎంత భూమి ఉందో తెలుస్తుంది. ఈ వివరాల ప్రకారం రైతులకు పంట భరోసా పథకం అమలు చేసే ఆలోచన చేస్తున్నాట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకి రూ.15వేల వరకు రైతుకు ఏటా చెల్లించనుంది. కానీ రైతుల రుణ మాఫీ కారణంగా గత 2 పంటలకు చెల్లించలేదు. అయితే ఈ సర్వే పూర్తి అయితే 7 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న చిన్న , సన్నకారు రైతులను గుర్తించి సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇచ్చే ఆలోచన చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. తద్వారా అసలైన అర్హులకు పంట సాయం అందడంతోపాటు ప్రభుత్వ ఖర్చు వృథా అవ్వదు అనేది కాంగ్రెస్ నాయకుల మాట.
అసలేందుకీ సర్వే…
తెలంగాణలో ప్రతి ఒక్క అర్హుడికి ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంతో ఈ సర్వే చేపడుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఈ సర్వే పారదర్శకంగా జరిగితే తెలంగాణలోని ప్రతి ఇంటి ముఖ చిత్రం ప్రతిబింబం అవుతుంది. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీ హామీల అమలుకు మార్గం సుమగం అవుతుంది. అలాగే అనర్హుల ఏరివేతకు అవకాశం దొరుకుతుంది. ఫలితంగా ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైస అర్హుడైన పేదలకి చేరుతుంది. అయితే గత ప్రభుత్వం కూడా ఈ రకమైన సర్వే చేసింది. ఇలాంటి ప్రయోజనాలే అసలైన పేదలు పొందుతారని తెలిపింది. కానీ, ఏళ్లు గడిచిన సర్వే ఫలితం పట్టాలెక్కలేదు. పేదల పరిస్థితిలో మార్పురాలేదు. మరి, ఈ సర్వే అయినా ఆ పరిస్థితులకు భిన్నంగా ఉంటుందో లేదో వేచి చూడాల్సి.4/5
ఇలా రాష్ట్రంలోని ప్రతి ఇంటిలోని ప్రతి అంశంపై అధ్యయన సర్వే చేశాక… అసలైన పథకాల లబ్ధిదారులను గుర్తించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ర్ట ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ , విద్య, ఉపాధి వంటి పలు అంశాలను ఈ సర్వే ప్రభావితం చేయనుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఏది ఏమైనా మాకొచ్చే పథకాలు ఈ సర్వే ద్వారా కోల్పోతామని సాధారణ ప్రజలు అందోళన చెందుతున్నారు. మరికొందరు ప్రభుత్వ పథకాలు ఇకనైన మాకు వస్తాయని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సర్వే ద్వారా అయినా బడుగు బలహీన వర్గాలకు అవసరమైన పథకం అందాలని ఆశిద్దాం.
Author: VS NEWS DESK
pradeep blr