పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. సర్పరాజైన ఆదిశేషుడు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా సేవలందించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది.
మంగళవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లు తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. సర్పరాజైన ఆదిశేషుడు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా సేవలందించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాల్లో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం వంటి పదాలు పూజల్లో ఉపయోగిస్తారు. రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా ఆదిశేషుడు స్వామివారికి అత్యంత సన్నిహితుడు. శ్రీ వైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడైన ఆదిశేషుడు స్వామివారు దాసభక్తికి ప్రతీకగా నిలుస్తూ తన ప్రియభక్తునిపై ఉభయ దేవేరులతో కలసి ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. బ్రహ్మోత్సవ వాహన సేవలలో తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఇవ్వడం అందులో భాగమే.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సివీఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీవోలు రామ్ కుమార్, సురేంద్ర, పేష్కార్ శ్రీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నా
తిరుమలలో పుష్పయాగ మహోత్సవం
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 9న, శనివారం, పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరగనుంది. నవంబరు 8న, శుక్రవారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ జరగనుంది. పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ విగ్రహాలను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేష అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో పుష్పయాగాన్ని వేడుకగా నిర్వహిస్తారు.
Author: VS NEWS DESK
pradeep blr