Andhra son-in-law: ప్రపంచం మొత్తం అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లా వడ్లూరు పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఉపాధ్యక్షులుగా బరిలోకి దిగిన జేడీ వెన్స్‌కు ఈ ఊరితో సన్నిహిత సంబంధాలు ఉండటమే ఇందుకు కారణం. జేడీ విజయాన్ని కోరుతూ వడ్లూరులో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించబడ్డాయి.
అమెరికా ఉపాధ్యక్షులుగా దాదాపు సీటు దక్కించుకున్న జేడీ వెన్స్ భార్య ఉషా వెన్స్ వడ్లూరు గ్రామానికి చెందినవారు. తద్వారా ఆంధ్రా అల్లుడే అమెరికాలో నంబర్ 2 అని గ్రామస్తులు సంబరపడిపోతున్నారు. ఉషా అమెరికాలోని శాన్ డియాగోలో జన్మించినా, ఆమె కుటుంబ మూలాలు వడ్లూరు గ్రామానికి చెందినవే. ఆమె పరివారం ఇప్పటికీ వడ్లూరుతో పలు సాంస్కృతిక సంబంధాలను కొనసాగిస్తూనే ఉంది. ఆయన విజయంతో అమెరికా-భారత్ సంబంధాలు మరింత మెరుగవుతాయని ఆశిస్తున్నారు.
ఉషా కుటుంబం వడ్లూరులోని పలు దేవాలయాల కోసం స్థలాలను దానం చేసింది. దీంతో ఎన్నికల వేళ గ్రామస్తులు స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ ఊరి అల్లుడి విజయం కోసం ప్రార్థించారు. జేడీ వెన్స్‌ను ఆమె 2014లో వివాహం చేసుకుని అమెరికా కోడలిగా మారింది. అయితే ఆమె తమ ఊరికి చెందిన వ్యక్తి కావడం ఎంతో గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉషా మరియు జేడీ వెన్స్ యేల్ లా స్కూల్‌లో కలిసి విద్యాభ్యాసం పూర్తి చేశారు. తదనంతర కాలంలో జేడీ వెన్స్ అనేక కష్టాలను ఎదుర్కొని అమెరికా సెనేటర్‌గా ఎదిగారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన విజయఢంకా మోగించడంతో అమెరికాకు ఇండియన్ మూలాలున్న మొదటి సెకండ్ లేడీగా ఉషా చరిత్ర సృష్టించబోతున్నారు. ఆమె పూర్వీకులు గోదావరి ప్రాంతం నుంచి వలసవెళ్లిన 50 ఏళ్ల తర్వాత ఇంత గొప్ప స్థాయికి చేరుకోవడంతో పలువురు అభినందిస్తున్నారు.
Author: VS NEWS DESK
pradeep blr