Search
Close this search box.

AP News: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న అమరావతి, పిఠాపురం!

AP Cabinet Important Decisions: ఏపీ కేబినేట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రోన్ పాలసీ, ఏపీ డేటా సెంటర్ పాలసీ 4.Oకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రభుత్వం డ్రోన్ రంగంలో 40,000 ఉద్యోగాల సృష్టి దిశగా కసరత్తులు చేస్తోంది. డ్రోన్ పరిశోధన చేపట్టే విద్యాసంస్థలకు రూ.20 లక్షల ప్రోత్సాహకాన్ని అందించాలని ఏపీ కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్‌గా, ఒర్వకల్లును డ్రోన్ హబ్‌గా అభివృద్ధి చేయబోతున్నట్లు మంత్రివర్గం వెల్లడించింది. 300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, పరిశోధన సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 25,000 మందికి డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇవ్వనున్నారు. 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి గ్రీన్ సిగ్నల్
సీఆర్డీఏ పరిధిని 8,352 చదరపు కిలోమీటర్లకు పెంపు
సీఆర్డీఏ పరిధిలోకి పల్నాడు, బాపట్ల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నుంచి 154 గ్రామాలు
11 మండలాల్లోని 154 గ్రామాలను తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి తెస్తూ కేబినెట్ ఆమోదం
జ్యుడీషియల్‌ అధికారుల ఉద్యోగ విరమణ వయసు 61కి పెంచుతూ నిర్ణయం
2024 నవంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చేలా చట్ట సవరణ బిల్లు

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..
Tags: AP cabinet , CM Chandrababu Naidu

 

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು