తెలంగాణలో ఇప్పుడు ఫార్ములా ఈ రేసింగ్ కేసు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు చుట్టుకోబోతోంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజ్ భవన్‌లో కేటీఆర్ అరెస్టు కోసం పర్మిషన్ తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఫార్ములా ఈ రేసింగ్ కోసం కేటీఆర్, HMDA ఫండ్స్ రూ.55 కోట్లను పక్కదారి పట్టించారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ పెద్దలు జోరుగా ప్రచారం చేస్తుంటే.. తాజాగా కేటీఆర్ స్పందించడమే కాదు.. తనను అరెస్టు చేస్తే చేసుకోమన్నారు. జైలు కెళ్లి యోగా చేసుకుంటానన్నారు. 3 నెలలు యోగా చేసి, స్లిమ్‌గా తయారై, తిరిగొచ్చి, పాదయాత్ర చేస్తానన్నారు. ఇంతలా ఆయన రియాక్ అవ్వడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. తెలంగాణ భవన్‌లో ఆయన ఏమన్నారంటే..
“55 కోట్లు ఫార్ములా వన్ రేసింగ్ కోసం ఆ కంపెనీకి ఇవ్వమని చెప్పింది నేనే. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా నాకున్న అధికారంతో ఇప్పించాను. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం ఆ డబ్బుల్ని చెల్లించాం. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేసింగ్‌ని రద్దు చేయడంతో ప్రభుత్వానికి భారీగా నష్టం వచ్చింది. కేసులు నాపై కాదు, ఇప్పుడున్న ప్రభుత్వంపై పెట్టాలి. నాపై ఏం కేసులు పెడతారు? కేసులకు భయపడేది లేదు. జైలుకు పంపిస్తే రోజూ యోగా చేసి మరింత ఫిట్‌గా తయారవుతాను. జైల్లో ఫిట్నెస్ పెంచుకొని బయటకు వచ్చి పాదయాత్ర చేస్తాను” అని కేటీఆర్ తెలిపారు.
ప్రకటనలు
“మోటార్ కార్ల రేసింగ్ అనేది ఒక క్రీడ. కబడ్డీ, ఖోఖో, క్రికెట్ లాగానే మోటార్ రేసింగ్ కూడా వరల్డ్ వైడ్ ఫేమస్. ప్రపంచంలో తొలిసారి 1894లో కార్ల రేసింగ్ పారిస్‌లో జరిగింది. ఫార్ములా -1 మొదటి రేస్ 1946లో తొలిసారిగా ఇటలీలో జరిగింది. ఎఫ్-1 రేస్‌ను ప్రతి సంవత్సరం వరల్డ్ వైడ్ నిర్వహిస్తారు. ఈ రేస్ నిర్వహించడానికి ప్రపంచ దేశాలు పోటీ పడతాయి. ఇండియాకి ఫార్ములా -1 రావాలనే కల ఇప్పటిది కాదు. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు 28 సెప్టెంబర్ 2003లో అప్పటి ఎఫ్-1 సీఈవోను కలిసి రంగారెడ్డి జిల్లాలో ఫార్ములా 1 పెట్టాలని కోరారు. ఆ కలను మేము నెరవేర్చాం. ఫార్ములా-1 జరగడానికి గోపన్‌పల్లి ప్రాంతంలో 1500 ఎకరాలు సేకరించాలని చంద్రబాబు నిర్ణయించారు. 400 ఎకరాలకు ట్రాక్ నిర్మించాలనుకున్నారు. ఆ 400 ఎకరాల్లో రేవంత్ రెడ్డి భూమి ఉంది. భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. భూములు ఇచ్చేది లేదని రైతులు కోర్టుకెళ్లారు. ఆ కేసు ఇంకా నడుస్తోంది” అని కేటీఆర్ తెలిపారు.
ఫార్ములా -1 కోసం చంద్రబాబు ఇటలీకి వెళ్లి అడిగారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. యూపీఏ హయాంలో యూపీలో మాయావతి ప్రభుత్వం.. జేపీ (జయప్రకాశ్ గ్రూప్)తో ఫార్ములా-1ను ఇండియాకి తెచ్చారు. 2011, 12, 13లో నోయిడాలో జేపీ గ్రూప్ ద్వారా ట్రాక్ నిర్మించారు. అక్కడ ఫార్ములా-1 రేస్ జరిగింది. 1984లో ఏషియన్ గేమ్స్, తర్వాత కామన్‌వెల్త్ గేమ్స్ ఢిల్లీలో జరిగాయి. కామన్ వెల్త్ గేమ్స్ కోసం రూ.70,608 కోట్లు ఖర్చు చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అంచనా వ్యయాన్ని 114 రెట్లు పెంచడంతో, కామన్‌వెల్త్ కుంభకోణంలో సురేశ్ కల్మాడీ జైలుకు వెళ్లాడు. 2013 అక్టోబర్ 24 నుంచి నవంబర్ 1 వరకు ఉమ్మడి ఏపీలో సీఎం చంద్రబాబు అధ్వర్యంలో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ జరిగాయి. వాటి ఖర్చు 103 కోట్లు. నోయిడాలో 2010-11లో ఫార్ములా-1 ఖర్చు 1,700 కోట్లు. తమిళనాడులో ఫార్ములా -4 రేస్‌కి రూ.42 కోట్లు ఖర్చు పెట్టారు” అని కేటీఆర్ అన్నారు.
Author: VS NEWS DESK
pradeep blr