వైద్యం వ్యాపారంగా మారిపోయింది. ఆసుపత్రిలో చేరే పేషెంట్ల ఆర్ధిక స్థితిని బట్టి..వాళ్ల అమాయకత్వాన్ని ఆధారంగా చేసుకొని డబ్బులు దండుకుంటున్న వైద్యులు నిత్యం ఏదో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నారు. ఠాగూర్ సినిమాలో ప్రాణం పోయిన వ్యక్తికి ట్రీట్‌మెంట్ చేస్తున్నట్లుగా మేనేజ్ చేసి పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేసే సీన్ అందరికి గుర్తుండిపోతుంది. ఇప్పుడు అదే స్టైల్లో హైదరాబాద్ మాదాపూర్ మెడికోవర్ ఆసుపత్రి వైద్యులు కూడా అలాగే సీన్ క్రియేట్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే డబ్బులు ఇవ్వలేదని రోగికి ట్రీట్ మెంట్ చేయని కారణంగానే ప్రాణాలు పోయానని బంధువులు ఆరోపిస్తున్నారు.
వ్యక్తికి ప్రాణాలు పోసే పవిత్ర వైద్య వృత్తికి కొందరు కళంకం తెస్తున్నారనే విమర్శలున్నాయి. కార్పొరేట్ వైద్యం పేరుతో రోగి రక్తాన్నిజలగల్లా తాగే వైద్యులతో పాటు బంధువులను ట్రీట్‌మెంట్ పేరుతో లక్షలు వసూలు చేసే వాళ్లు లేకపోలేదు. తాజాగా హైదరాబాద్ మాదాపూర్ లోని మెడికోవర్ ఆసుపత్రి వైద్యుల తీరుపై ఓ రోగి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగప్రియ అనే జూనియర్ డాక్టర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితో ఇప్పటి వరకు 3లక్షలు కట్టించుకున్న వైద్యులు.. మరో 4లక్షలు కట్టాలని బంధువుల్ని డిమాండ్ చేశారు.
అంత డబ్బు కట్టే ఆర్ధిక పరిస్థితి లేకపోవడంతో నాగప్రియ బంధువులు ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో ఫోన్ చేయించారు. ప్రజాప్రతినిధి ఫోన్ కాల్ ను సీరియస్ గా తీసుకోకుండా ట్రీట్ మెంట్ విషయంలో జాప్యం చేశారు. దీంతో పేషెంట్ నాగప్రియ చనిపోయింది. అయితే అప్పటికే 3లక్షలు కట్టిన నాగప్రియ బంధువులను మరో 3లక్షలు కడితేనే వైద్యం చేస్తామని లేదంటే ఆపేస్తామని ఫోన్ కాల్ చేసారు. అయితే రోగి నాగప్రియ బంధువులు బుధవారం లక్ష కట్టారు. తర్వాత నాగప్రియ చనిపోయిందని చెప్పారు డాక్టర్లు.
ఠాగూర్ సీన్ రిపీట్..
ఈవ్యవహారం మొత్తం ఠాగూర్ సినిమాలోని హాస్పిటల్ ఫేక్ ట్రీట్‌మెంట్ సీన్ ను గుర్తు చేశారు మెడికోవర్ ఆసుపత్రి వైద్యులు. డబ్బుల కోసం కక్కూర్తి పడి వైద్యం ఆపేశారని ఆరోపిస్తున్నారు మృతురాలు నాగప్రియ బంధువులు. ప్రాణాలతో ఉన్న వ్యక్తికి ట్రీట్ మెంట్ చేయమని తెస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా డబ్బులిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు.
రోగి బంధువులు ఆగ్రహం..
మృతదేహం కోసం నాగప్రియ బంధువులు మెడికోవర్ హాస్పిటల్ దగ్గర ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. కేవలం డబ్బు కోసమే మెడికోవర్ ఆసుపత్రి వైద్యులు పేషెంట్ చనిపోయిన విషయాన్ని గోప్యంగా ఉంచారని బంధువులు ఆరోపిస్తున్నారు.రోగి బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
Author: VS NEWS DESK
pradeep blr