కాంగ్రెస్ ట్రబుల్ షూటర్స్..: బిగ్ టాస్క్

Maharashtra Assembly elections 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి. జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తోన్నాయి. నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో రోడ్‌షోలు, బహిరంగ సభలతో హోరెత్తిపోతోంది మహారాష్ట్ర.

288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అదే నెల 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజున కౌంటింగ్‌ నిర్వహించనుంది ఈసీ. ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది తేలేది అప్పుడే.

ఈ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్స్ రంగంలోకి దిగారు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సుఖ్వీందర్ సింగ్ సుకుతో పాటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. ముంబైలో అడుగు పెట్టారు. మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తప్పుడు చేస్తోన్నారంటూ రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ఆరోపించారు. తెలంగాణ, కర్ణాటకల్లో అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయట్లేదంటూ మోదీ చెబుతోండటాన్ని తప్పు పట్టారు. ఏ ఒక్క హామీని కూడా విస్మరించట్లేదని, కావాలంటే స్వయంగా తమ రాష్ట్రాలకు వచ్చి చూడొచ్చని హితవు పలికారు.

మోదీ అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ విమర్శించారు. నిజం ఏమిటో చెప్పకపోతే గానీ ఆయన చేస్తోన్న ఈ అబద్ధపు ప్రచారానికి తెర పడదని, అందుకే స్వయంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సి వస్తోందని అన్నారు.

తెలంగాణ, కర్ణాటకల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, ప్రతి నెలా గృహావసరాల కోసం ఉచిత విద్యుత్ పథకం అమలులో ఉందని పేర్కొన్నారు. అలాగే- మహిళలకు ప్రతినెలా ఆర్థిక సహయాన్ని అందిస్తోన్నామని వివరించారు. కర్ణాటకలో యువనిధి కింద నిరుద్యోగులకు 3,000, డిప్లొమా హోల్డర్లకు 1,500 రూపాయల మొత్తాన్ని ఇస్తోన్నామని డీకే శివకుమార్ అన్నారు.

తెలంగాణలో రైతుల రుణాలను మాఫీ చేసిన అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేశామని, తాము అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల్లోనే 50,000 ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. కావాలంటే ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌ను తమ రాష్ట్రానికి పంపించి వివరాలు తెలుసుకోవచ్చనీ సూచించారు.

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು