పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుతం ప్రజల సేవలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్.. త్వరలోనే వీలు చూసుకుని తన సినిమా షూటింగ్స్ కంప్లీట్ చేస్తానని గతంలోనే చెప్పారు. ఇదిలా ఉంటే.. పవన్ నెక్ట్స్ మూవీస్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

Pawan Kalyan
పవన్ కళ్యాణ్ మొదట్లో డైరెక్టర్ కావాలనుకున్నారట. కానీ వదిన సురేఖ మాటతో నటనపై వైపు అడుగులు వేశారు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. ఈవీవీ డైరెక్ట్ చేసిన సినిమాలో నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ కథానాయికగా నటించింది. ఖయామత్ సే ఖయామత్ అనే హిందీ సినిమాకు రీమేక్ గా వచ్చింది ఈమూవీ. అప్పట్లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు.
అయితే తన ఫస్ట్ సినిమాకు పవన్ కళ్యాణ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా.. కేవలం రూ.50 వేలు మాత్రమే. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు పవన్ నెలవారీ జీతం తీసుకున్నాడట. అంటే నెలకు ఐదు వేలు మాత్రమే తీసుకున్నారట. అంటే సినిమా మొత్తం పూర్తయ్యేసరికి రూ.50 వేలు తీసుకున్నారట. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం పవన్ తన ఒక్క సినిమాకు దాదాపు రూ.2 కోట్ల వరకు తీసుకుంటున్నారట. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.