తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా సినిమాలు చేయనప్పటికీ ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ప్రభాస్ తో కెమిస్ట్రీ బాగుండటంతోపాటు మూడు సినిమాల్లో కలిసి నటించారు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు వచ్చాయికానీ వాటిని ప్రభాస్ కొట్టి పారేశాడు. కేవలం తమ మధ్య స్నేహం ఉందన్నాడు. దీంతో పుకార్లకు చెక్ పడింది. బాహుబలి1, బాహుబలి2 సినిమాలతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన తర్వాత ‘నిశ్శబ్దం’, ‘భాగమతి’, ‘సైజ్ జీరో, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆచితూచి పాత్రలను ఎంపిక చేసుకుంటోంది. ‘ఘాటీ’, ‘కథనార్’ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
అప్పుడప్పుడు అనుష్క పోస్టులు
ఇటీవలే విడుదలైన ఘాటూ గ్లింప్స్ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండనప్పటికీ అప్పుడప్పుడు మాత్రం పోస్టులు పెడుతుంటుంది. అయితే అభిమానులు మాత్రం అనుష్క ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా? ఎవరిని చేసుకుంటుందా? ప్రభాస్ ను చేసుకోవడానికి అవకాశం ఉందా? అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటువంటి తరుణంలో అనుష్క వివాహానికి సంబంధించి ఓ వార్త వైరలవుతోంది. తాజాగా ఓ దర్శకుడిని వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతోందనేది ఆ వార్త సారాంశం. ఆ దర్శకుడు ఎవరో కాదు.. కోవెలమూడి ప్రకాష్. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు.
త్వరలోనే పెళ్లంటూ వార్తలు
కొన్నాళ్ల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించిన అనుష్క మాత్రం ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, తాను ఎప్పుడు, ఎవరిని, ఎక్కడ పెళ్లి చేసుకుంటాను అనే విషయాన్ని అందరికీ చెబుతానని, అధికారికంగా ప్రకటిస్తానని, అప్పటివరకు ఇటువంటి వార్తలను రాయొద్దని, ప్రసారం చేయొద్దని కోరుతోంది. ఇటువంటి రూమర్లు రావడంవల్ల చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందని, మనసు ఆందోళనకు గురవుతుందని చెప్పింది. ఈ తరహా వార్తలను వ్యాప్తి చేసే ప్రయత్నాలను మీడియా కూడా మానుకోవాలని విన్నవించుకుంటోంది.