దీపావళి, ఛత్ పండగల అనంతరం ప్రజలు తిరుగు ప్రయాణం అవుతుండటంతో రైళ్లల్లో రద్దీ నెలకొంటోంది. పండగల సమయంలోనే కాకుండా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉందనుకుంటే ఒకరోజు ముందుగా ప్రకటించి ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అనంతపురం మీదుగా నడుపుతోంది. ఈనెల 12, 19 తేదీల్లో బెంగళూరు నుంచి బరౌనికి ప్రత్యేక రైలు (06563) బయలుదేరుతుంది.
ఈ రైలు ఈ రెండు తేదీల్లో రాత్రి 9.15 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి తర్వాత రోజు రాత్రి 8.00 గంటలకు బరౌనీ చేరుకుంటుంది. ధర్మవరం, అనంతపురం, డోన్ మీదుగా ఇది ప్రయాణిస్తుంది. అలాగే తిరుగు ప్రయాణంో 06564 నెంబరుతో 15, 22 తేదీల్లో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి తర్వాతరోజు సాయంత్రం 6.00 గంటలకు బెంగళూరు చేరుకుంది.
యశ్వంతపూర్- ముజఫర్‌పూర్ మధ్య నడుస్తున్న మరో రెండు ప్రత్యేక రైళ్లు కూడా అనంతపురం మీదుగా ప్రయాణిస్తాయి. ఈనెల 13వ తేదీ ఉదయం 7.30 గంటలకు 06229 యశ్వంతపూర్‌లో బయలుదేరి ధర్మవరం, అనంతపురం, డోన్ మీదుగా తర్వాత రోజు ఉదయం 9.45కు ముజఫర్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 06230 నెంబరుతో ముజఫర్‌పూర్‌లో 16వ తేదీ ఉదయం 10.45కు బయలుదేరి తర్వాతరోజు ఉదయం 10.30కు యశ్వంతపూర్ చేరుకుంటుంది.
యశ్వంతపూర్ నుంచి దానాపూర్ వరకు అధికారులు మరో ప్రత్యేక రైలును నడుపుతున్నారు. ఈనెల 14, 21 తేదీల్లో 06271 నెంబరుతో యశ్వంత్ పూర్ లో ఉదయం 7.30 గంటలకు బయలుదేరి ధర్మవరం, అనంతపురం, డోన్ మీదుగా దానాపూర్ కు తర్వాతరోజు ఉదయం 6.00 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 06272 నెంబరుతో 17, 24 తేదీల్లో ఉదయం 8.00 గంటలకు దానాపూర్ లో బయలుదేరి తర్వాతరోజు ఉదయం 10.30 గంటలకు యశ్వంత్ పూర్ చేరుకుంటుంది. అయితే ఈ రైలుకు అనంతపురం స్టేషన్ లో హాల్టింగ్ సౌకర్యం కల్పించలేదు.