Search
Close this search box.

సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త: ఏకంగా హైదరాబాద్ సీపీ డీపీతో వాట్సాప్ కాల్స్

సైబర్ కేటుగాళ్లు సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. ఏకంగా పోలీసు ఉన్నతాధికారులనే తమ మోసాలకు వాడుకుంటున్నారు. అధికారుల ఫొటోలను డీపీలుగా పెట్టుకుని వాట్సాప్ కాల్స్ చేస్తూ ప్రజలను భయపెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. కాగా, హైదరాబాద్‌కు చెందిన పలువురికి సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఫొటో డీపీగా ఉన్న వాట్సాప్ నెంబర్ నుంచి శుక్రవారం కాల్స్ వచ్చాయి.

సీపీ ఆనంద్ డీపీతో కాల్స్ రావడంతో ఆ వ్యక్తులు కొంత భయాందోళనలకు గురయ్యారు. కాల్స్‌పై సీపీ ఫొటో డీపీగా ఉండటం, ఫోన్ నెంబర్ అనుమానాస్పదంగా ఉండటంతో ఆ కాల్స్‌కు స్పందించని కొందరు విషయాన్ని సైబర్ క్రైంతోపాటు సీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో వెంటనే స్పందించిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. తన ఫొటో డీపీగా ఉన్న నెంబర్ నుంచి వచ్చే కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు.

సైబర్ నేరగాళ్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు. ఏమైనా అనుమానాలు ఉంటే. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930, డయల్ 100/122 నెంబర్లకు ఫోన్ చేసి పోలీసులను సంప్రదించాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సూచించారు. తన డీపీతో వచ్చిన ఫోన్ కాల్స్ పరిశీలించామని, ఆ ఫోన్ నెంబర్ పాకిస్థాన్ కంట్రీ కోడ్ కోడ్ (+92)తో ప్రారంభమయ్యాయని తెలిపారు.

ఇండియా ఫోన్ నెంబర్లు +91 కంట్రీ కోడ్‌తో ప్రారంభమవుతాయని, అది ప్రజలు గమనించాలని సీపీ సూచించారు. 92 కంట్రీ కోడ్‌తో పోలీసుల పేరుతో ఎవరు కాల్స్ చేసినా.. రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా ఎవరూ స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. ఏమైనా అనుమానం ఉంటే వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నెంబర్ల(1930, డయల్ 100/122)ను సంప్రదించాలని ప్రజలకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సూచించారు.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು