Search
Close this search box.

Axis My India Maharashtra Exit Poll: ఎన్డీఏకే జై కొట్టిన యాక్సిస్ మై ఇండియా

మహారాష్ట్రలో బుధవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో యాక్సెస్ మై ఇండియా తన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తాజాగా గురువారం సాయంత్రం విడుదల చేసింది. బీజేపీ నేతృత్వంలోని అధికార మహాయుతి కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చింది. యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. మహారాష్ట్రలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) గణనీయమైన విజయం సాధించేందుకు సిద్ధంగా ఉంది.

జాతీయ రాజకీయ దృశ్యాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్డీఏకు రాష్ట్రంలో అనుకూలమైన అంచుని పోల్ అంచనా వేసింది. ఖచ్చితమైన సీట్ల సంఖ్య ఇంకా వెల్లడి కానప్పటికీ.. ఈ ఎగ్జిట్ పోల్స్ అధికార కూటమికి బలమైన ఓటరు మద్దతును సూచిస్తున్నాయి. ఈ పరిణామం రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు జాతీయ స్థాయిలో ఎన్డీయే స్థానాన్ని పటిష్టం చేయగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Axis My India Maharashtra Exit Poll gives big edge to NDA

కాగా, మహారాష్ట్రలోని ప్రాంతాల వారీగా యాక్సెస్ మై ఇండియా తన ఎగ్జిట్ పోల్స్ వివరాలను వెల్లడించింది. మరఠ్వాడా ప్రాంతంలో 46 సీట్లకు గానూ మహాయుతికి 30 స్థానాలు, ఎంవీఏకు 15 స్థానాలు, ఇతరులకు 1 స్థానం దక్కుతుందని అంచనా వేసింది. ఇక ఓట్ షేర్ విషయానికొస్తే.. మహాయుతికి 45 శాతం, ఎంవీఏకు 38 శాతం, వీబీఏకు 5 శాతం, ఇతరులకు 12 శాతం రానుందని పేర్కొంది.

కొంకణ్, థానే ప్రాంతాల్లోని 39 సీట్లలో మహాయుతికి 24 సీట్లు, ఎంవీఏకు 13 సీట్లు, ఇతరులకు 2 సీట్లు దక్కుతాయని యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇక ఓటు షేరింగ్ విషయానికొస్తే.. మహాయుతికి 50 శాతం, ఎంవీఏకు 33 శాతం, వీబీఏకు 2 శాతం, ఇతరులకు 15 శాతం లభిస్తుందని పేర్కొంది.

ముంబై ప్రాంతంలోని 36 సీట్లలో మహాయుతికి 22 సీట్లు లభిస్తాయని, ఎంవీఏకు 14 సీట్లు వస్తాయని అంచనా వేసింది యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్. ఇక, ఓట్ షేర్ విషయానికొస్తే.. మహాయుతికి 45 శాతం, ఎంవీఏకు 43 శాతం, వీబీఏకు 2 శాతం, ఇతరులకు 10 శాతం ఓటు షేర్ వస్తుందని అంచనా వేసింది.

నార్త్ మహారాష్ట్రలోని 47 సీట్లలో మహాయుతికి 38 స్థానాలు, ఎంవీఏకు 7, ఇతరులకు 2 సీట్లు దక్కుతాయని యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ తేల్చింది. ఇక ఓటు షేర్ విషయానికొస్తే.. మహాయుతికి 53 శాతం, ఎంవీఏకు 32 శాతం, వీబీఏకు 2, ఇతరులకు 13 శాతం ఓట్లు లభిస్తాయని అంచనా వేసింది.

వెస్టెర్న్ మహారాష్ట్ర ప్రాంతంలోని 58 సీట్లలో మహాయుతికి 36 స్థానాలు, ఎంవీఏకు 21 స్థానాలు, ఇతరులకు ఒక సీటు దక్కుతుందని యాక్సెస్ మై ఇండియా అంచనా వేసింది. ఇక ఓటు షేర్ విషయానికొస్తే.. మహాయుతికి 48 శాతం, ఎంవీఏకు 41 శాతం, వీబీఏకు 2 శాతం, ఇతరులకు 9 శాతం ఓట్లు పోలయ్యాయని పేర్కొంది.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು