పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు కేంద్రం రంగం సిద్దం చేస్తోంది. వచ్చే వారం ప్రారంభమయ్యే ఈ సమావేశాలు వచ్చే నెల వరకూ సాగబోతున్నాయి. ఇందులో పలు కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టి ఆమోదించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో కీలకమైన వక్ఫ్ బోర్డు చట్టం సవరణ బిల్లు కూడా ఉంది. ఇప్పటికే జాయింట్ పార్లమెంటరీ కమిటీ అభిప్రాయాలు సేకరించిన ఈ బిల్లుతో పాటు ఇతర బిల్లుల్ని లోక్ సభ, రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టబోతోంది.
కేంద్రంలో ఈసారి మారిన పరిస్ధితుల్లో బిల్లుల ఆమోదం కోసం ఎన్డీయేకు మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ కీలకంగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఈ నెల 25న ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాలు వచ్చే నెల 20 వరకూ సాగబోతున్నాయి. ఇందులో దాదాపు 18 బిల్లుల్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఇందులో పలు కీలక బిల్లులు ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఇప్పటికే ఓసారి తిరస్కరణకు గురైన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు కూడా ఉంది. ఈ బిల్లును ఎన్డీయే భాగస్వామి టీడీపీ వ్యతిరేకిస్తోంది.
ఈసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుల్లో 13 పెండింగ్ బిల్లులే ఉన్నాయి. అలాగే ఐదు కొత్త బిల్లులు ఉన్నాయి. వీటిని లోక్ సభ, రాజ్యసభల్లో ప్రవేశపెట్టాల్సి ఉంది. లోక్ సభలో 15 బిల్లులు పెట్టేందుకు వీలుగా బులిటెన్ విడుదల చేశారు. రాజ్యసభలో మొత్తం 18 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంది. దీంతో కేంద్రానికి ఇదో పెద్ద టాస్క్ గా మారిపోయింది. అయితే మిత్రపక్షాల సాయంతో ఇరు సభల్లోనూ ఈ బిల్లుల్ని ఆమోదింపజేసుకుంటామని కేంద్రం చెబుతోంది.
Author: VS NEWS DESK
pradeep blr