Search
Close this search box.

PM Modi: ఆ 3 ప్రత్యేక అంశాలే భారత్, గయానాలను కలిపేలా చేస్తున్నాయ్: ప్రధాని మోదీ

PM Narendra Modi: ఇండో-గయానీస్ కమ్యూనిటీని, కరేబియన్ దేశ అభివృద్ధికి వారు చేస్తున్న కృషిని ప్రధాన మంత్రి ప్రశంసించారు. ముఖ్యంగా సంస్కృతి, ఆహారం, క్రికెట్ అనే మూడు అంశాలు భారత్‌ను, గయానాను కలిసిపోయేలా చేశాయని ఆయన అన్నారు.

PM Modi: ఆ 3 ప్రత్యేక అంశాలే భారత్, గయానాలను కలిపేలా చేస్తున్నాయ్: ప్రధాని మోదీ

PM Narendra Modi: రెండు దేశాల మధ్య ఉన్న సారూప్యతలపై మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. సంస్కృతి, ఆహారం, క్రికెట్ వంటి విభిన్న విషయాలు భారతదేశాన్ని, గయానాను లోతుగా అనుసంధానిస్తున్నాయని చెప్పుకొచ్చారు. గయానాలో గురువారం జరిగిన ఒక కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి, ఇండో-గయానీస్ సమాజాన్ని, కరేబియన్ దేశ అభివృద్ధికి చేస్తున్న కృషిని కొనియాడారు. ప్రధానమంత్రి బుధవారం గయానా చేరుకున్నారు. 50 సంవత్సరాల తర్వాత భారత దేశాధినేత చేసిన మొదటి పర్యటనగా నిలిచింది.

ఇండో-గయానీస్ సమాజ స్ఫూర్తికి వందనం చేసిన ఆయన.. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం ఎంతో కాలంగా ఇరు దేశాలు పోరాడాయని గుర్తు చేశారు. గయానాను వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా మార్చడానికి ఆ దేశం చేసిన కృషిని గుర్తు చేశారు. ఎన్నారైలను దేశ రాయబారులుగా పేర్కొన్న మోదీ.. వారు భారతీయ సంస్కృతి, విలువలకు రాయబారులని అంటూ చెప్పుకొచ్చారు.

భారతదేశం నుంచి భారతీయులు బయటకు వెళ్లవచ్చు.. కానీ, ఒక భారతీయుడి నుంచి భారతదేశాన్ని మాత్రం తీసేయలేమంటూ తెలిపారు. ఇండో-గయానీస్ సమాజానికి గయానా మాతృభూమి అని, భారతమాత వారి పూర్వీకుల భూమి అని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. భారతదేశ అభివృద్ధి గురించి మాట్లాడితే, ఇది స్ఫూర్తిదాయకమే కాకుండా అందరినీ కలుపుకొని పోతుందన్నారు.

అధ్యక్షుడు అలీకి ధన్యవాదాలు..

గయానాలోని జార్జ్‌టౌన్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నా కోసం తన ఇంటి తలుపులు తెరిచినందుకు అధ్యక్షుడు అలీకి ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షుడు అలీ, అతని అమ్మమ్మతో కలిసి మేం కూడా ఒక మొక్కను నాటాం. ఇది మా చొరవలో ఓ భాగం. ‘ఏక్ పెడ్ మా కే నామ్’ అంటూ ప్రసగించారు. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే భావోద్వేగ క్షణం. గయానా అత్యున్నత జాతీయ పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని అందుకోవడం నాకు ఎంతో గౌరవంగా ఉందంటూ తెలిపారు.

ఒకే జీవన విధానం..

ఇండో – గయానీస్ కమ్యూనిటీకి కూడా ప్రత్యేకమైన ఆహార సంప్రదాయం ఉందని, ఇందులో భారతీయ, గయానీస్ అంశాలు రెండూ ఓకేలా ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. దాల్‌పురి ఇక్కడ ప్రసిద్ధి చెందిందని నేను విన్నాను. క్రికెట్‌పై ప్రేమ కూడా మనల్ని కట్టిపడేస్తుంది. ఇది కేవలం ఆట మాత్రమే కాదు, మన జాతీయ గుర్తింపులో లోతుగా పొందుపరిచిన ఓ జీవన విధానం అని తెలిపారు.

గయానా ప్రజలు భారతదేశ శ్రేయోభిలాషులు..

గయానా ప్రజలు భారతదేశ శ్రేయోభిలాషులని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశంలో జరుగుతున్న పురోగతిని నిశితంగా గమనిస్తూ ఉండాలి. కేవలం 10 సంవత్సరాలలో, భారతదేశం 10 వ అతిపెద్ద దేశంగా అభివృద్ధి చెందింది. ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో నిలిచింది. త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు సిద్ధమైందంటూ తెలిపారు. మన యువత ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థగా తీర్చిదిద్దారు. మనం మార్స్, చంద్రుడి వద్దకు చేరుకున్నాం అంటూ చెప్పుకొచ్చాడు.

రెండు శతాబ్దాల బంధం..

గయానా ప్రెసిడెంట్ మహ్మద్ ఇర్ఫాన్ అలీ మాట్లాడుతూ.. ఈ రోజు జరిగే ఈ సభకు మీ అందరినీ స్వాగతిస్తున్నందుకు గర్వంగా, సంతోషించాల్సిన విషయమన్నారు. ఈ సమావేశం దాదాపు రెండు శతాబ్దాల బంధాన్ని జరుపుకుంటుంది. గయానాలో భారతీయుల ఉనికి మన దేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం. ఇది 186 సంవత్సరాల క్రితం మొదలైంది. మొదటి భారతీయులు 1838లో ఒప్పంద వలసదారులుగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ప్రారంభమైంది. వ్యవసాయం నుంచి వాణిజ్యం వరకు, విద్య నుంచి సంస్కృతి వరకు, క్రీడల నుంచి వ్యాపారం వరకు, భారతీయులు గయానా అభివృద్ధిలో దోహదపడ్డారు. మన పండుగలు, వంటకాలు, సంప్రదాయాలలో స్పష్టంగా కనిపించే భారతీయ సంస్కృతి చైతన్యం మన జాతీయ గుర్తింపులో అంతర్భాగంగా మారిందని తెలిపారు.

ప్రధాని మోదీ గయానా నుంచి ఢిల్లీకి..

నవంబర్ 16 నుంచి 21 వరకు మూడు దేశాల నైజీరియా, బ్రెజిల్, గయానా పర్యటనను ముగించిన తరువాత, పీఎం నరేంద్ర మోడీ గయానాలోని జార్జ్‌టౌన్ నుంచి నైజీరియా పర్యటనతో ఢిల్లీకి బయలుదేరారు. బ్రెజిల్‌లో జరిగిన 19వ జీ20 సదస్సులో ఆయన పాల్గొన్నారు. తన పర్యటన చివరి రోజు ప్రధాన మంత్రి గయానా రాష్ట్ర పర్యటనకు వెళ్లారు. గయానాలో జరిగిన 2వ ఇండియా-కారికోమ్ సమ్మిట్‌కు ప్రధాన మంత్రి సహ-అధ్యక్షత వహించారు.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು