Search
Close this search box.

Mahayuti: మహారాష్ట్రలో చరిత్ర తిరగరాసిన ఎన్డీయే-52 ఏళ్ల రికార్డు బద్దలు..!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి సాధించిన విజయం ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఏకంగా 229 సీట్లు సాధించిన మహాయుతి కూటమి చరిత్ర సృష్టించింది. ఎప్పుడో ఐదు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ పార్టీ సాధించిన భారీ విజయం తర్వాత రాష్ట్రంలో ఏ పార్టీ కానీ, కూటమి కానీ ఇంత భారీ విజయాన్ని నమోదు చేసుకోలేదు. దీంతో మహాయుతి కూటమి సాధించిన విజయంపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది.

1972లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో అసెంబ్లీలో మొత్తం 270 సీట్లు ఉండేవి. ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత వసంత్ రావ్ నాయక్ ఉండేవారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 56.36 శాతం ఓటు శాతంతో 222 సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది. ఆ ఎన్నికల్లో భారతీయ జనసంఘ్ కేవలం 7 సీట్లకు పరిమితమైంది. ఆ తర్వాత మరే పార్టీ కానీ కూటమి కానీ ఈ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఆ రికార్డును తిరగరాసేలా మహారాష్ట్రలో మహాయుతి కూటమి అంతటి భారీ విజయం సాధించింది.

ఈసారి ఎన్నికల్లో మహాయుతి సాధించిన విజయం ఓ రికార్డు అయితే అందులో బీజేపీ సాధించిన సీట్లు, ఓట్లు మరో ఎత్తుగా మారాయి. ప్రస్తుతం తాజా ఫలితాలను బట్టి చూస్తే మహాయుతి కూటమి 229 సీట్లు గెల్చుకునేలా ఉంది. ఇందులో బీజేపీ ఒక్కటే 133 సీట్లు గెల్చుకుంటోంది. బీజేపీ స్ట్రైక్ రేట్ 89.26 శాతంగా ఉంది. అలాగే శివసేన షిండే గ్రూప్ 64.63 శాతం స్ట్రైక్ రేట్, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 66 శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తోంది. మరోవైపు విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి మాత్రం 53 సీట్లకు పరిమితమయ్యేలా ఉంది. విపక్ష కూటమిలో అత్యధిక స్ట్రైక్ రేట్ శివసేన ఉద్ధవ్ వర్గానికే ఉంది.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು