కర్నాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి పట్టు నిలుపుకుంది. తాజాగా రాష్ట్రంలో జరిగిన మూడు ఉపఎన్నికల్లో సత్తా చాటింది. రాష్ట్రంలోని మూడు అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాలు నమోదు చేసుకుంది. వీటిలో బీజేపీ, జేడీఎస్ కు నిరాశ తప్పలేదు. ఉపఎన్నికలు జరిగిన సీట్లలో చన్నపట్న, షిగ్గావ్, సండూర్ సీట్లు ఉన్నాయి. వీటిలో గెలుపు కోసం బీజేపీ, జేడీఎస్ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.కర్నాటకలోని చన్నపట్న అసెంబ్లీ స్ధానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి సీపీ యోగేశ్వర ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, జేడీఎస్ అభ్యర్ధి అయిన నిఖిల్ గౌడను 25 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడించారు. అలాగే షిగ్గావ్ స్ధానంలో పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తనయుడు భరత్ బొమ్మైపై కాంగ్రెస్ అభ్యర్ధి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్ 13 వేలకు పైగా తేడాతో ఓడించారు
మరోవైపు సండూర్ స్ధానంలో కాంగ్రెస్ అభ్యర్ధి ఈ అన్నపూర్ణ.. తన సమీప ప్రత్యర్ది, బీజేపీ అభ్యర్ధి అయిన బంగార హనుమంతపై దాదాపు 10 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. షిగ్గావ్ తో జేడీఎస్, సండూర్, చన్నపట్నలో బీజేపీ అభ్యర్ధుల్ని కాంగ్రెస్ అభ్యర్ధులు ఓడించారు. ఈ మూడు సీట్లలోనూ ఎమ్మెల్యేలు గత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ మూడు సీట్లలోనూ ఎన్డీయేలో బీజేపీ, దాని భాగస్వామి జేడీఎస్ తో కాంగ్రెస్ ముఖాముఖీ తలపడి గెలిచింది.
Author: VS NEWS DESK
pradeep blr