కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ 4,08,036 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రియాంక గాంధీకి ఇప్పటివరకూ 6,17,942 ఓట్లు రాగా భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి సత్యన్ ముకేరి 2,09,906 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ (1,09,202 ఓట్లు) ఉన్నారు. కాగా, తొలిసారి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. గత ఎన్నికల్లో వయనాడ్లో రాహుల్ గాంధీకి 3.64 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే ఇప్పటికే ఆ మెజార్టీ మార్క్ దాటి రికార్డ్ సృష్టించారు ప్రియాంక.
వాయనాడ్ ఉపఎన్నికలో దాదాపు 65 శాతం ఓటింగ్ నమోదైంది, ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన లోక్సభ ఎన్నికలలో 74 శాతం నమోదయ్యింది. 2019 సాధారణ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.
Author: VS NEWS DESK
pradeep blr