Search
Close this search box.

IPL Auction 2025: చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు వీరే.. ఇంకా ఎంత మంది కావాలంటే..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం కొనసాగుతోంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఆదివారం వేలం విజయవంతంగా సాగింది. రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు జరిగిన వేలంలో ప్రాంజేజీలు పోటీ పడి ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. సోమవారం కూడా వేలం కొనసాగనుంది. అయితే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఏడుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇందులో నూర్ అహ్మద్ ను రూ.10 కోట్లకు కొనుగోలు చేయగా.. రవిచంద్రన్ అశ్విన్ ను రూ.9.75 కోట్లకు వేలంలో దక్కించుకుంది.

డెన్ కాన్వే ను రూ.6.25 కోట్లు, రాహుల్ త్రిపాఠి రూ.3.4 కోట్లు, రచిన్ రవీంద్రను రూ.4 కోట్లు, కలీల్ అహ్మద్ ను 4.8 కోట్లు, విజయ్ శంకర్ ను రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందులో రుతురాజ్ గైక్వాడ్ (రూ. 18 కోట్లు), మతీషా పతిరానా (రూ. 13 కోట్లు), శివమ్ దూబే (రూ. 12 కోట్లు), రవీంద్ర జడేజా (రూ. 18 కోట్లు), ఎంఎస్ ధోని (రూ. 4 కోట్లు) ఉన్నారు. సీఎస్కే రిటైన్ ఆటగాళ్ల కోసం రూ.65 కోట్లు ఖర్చు చేసింది.

ఆదివారం వేలంలో ఆటగాళ్ల కోసం రూ.39. 4 కోట్లను ఖర్చు చేసింది. ఇప్పటి వరకు తన పర్స్ లోని రూ.104.4 కోట్లు ఖర్చు చేసింది. ఇంకా ఆ జట్టు వద్ద రెండో రోజు వేలానికి రూ. 15.60 కోట్లు మిగిలి ఉన్నాయి. రెండో రోజు వేలంలో ఫాస్ట్ బౌలర్ తో పాటు, బ్యాటర్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ కు రెండో రోజు 13 మంది స్వదేశీ ఆటగాళ్లను, నలుగురు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. ఆటగాళ్ల ధరను బట్టి ఆటగాళ్ల సంఖ్య ఉంటుంది.

ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఒక జట్టులో గరిష్ఠంగా 25 మంది ఆటగాళ్లు, కనిష్ఠంగా 21 మంది ఆటగాళ్లు ఉండొచ్చు. ప్రస్తుతం చెన్నై జట్టులో 12 మంది ఆటగాళ్లు ఉన్నారు. వీరు గరిష్ఠంగా 13 మందిని కనిష్ఠంగా 9 మంది ఆటగాళ్లను తీసుకోవచ్చు. ప్రస్తుతం జట్టులో ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, రుత్ రాజ్ గైక్వాడ్, మతీషా పతిరాన్, శివమ్ దూబే, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, డెన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, కలీల్ అహ్మద్, విజయం శంకర్ ఉన్నారు.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು