సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ను పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపర్చారు. 11 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టు ముందుంచిన పోలీసులు.. విజయ్‌పాల్‌ను రిమాండ్‌కు ఇవ్వాలని కోరారు. రఘురామను జైల్లో టార్చర్ పెట్టిన కేసులు విజయ్ పాల్ కీలక వ్యక్తి అని.. జైట్టో థర్డ్ డిగ్రీ పాటంచడం వెనుక అసలు సూత్రధారులు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీని కోసం కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని పోలీసులు కోర్టు కు చెప్పారు. రిమాండ్ రిపోర్టు పరిశీలించిన న్యాయమూర్తి విజయ్‌పాల్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ను పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపర్చారు. 11 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టు ముందుంచిన పోలీసులు.. విజయ్‌పాల్‌ను రిమాండ్‌కు ఇవ్వాలని కోరారు. రఘురామను జైల్లో టార్చర్ పెట్టిన కేసులు విజయ్ పాల్ కీలక వ్యక్తి అని.. జైట్టో థర్డ్ డిగ్రీ పాటంచడం వెనుక అసలు సూత్రధారులు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీని కోసం కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని పోలీసులు కోర్టు కు చెప్పారు.రిమాండ్ రిపోర్టు పరిశీలించిన న్యాయమూర్తి విజయ్‌పాల్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
మంగళవారం విజయ్ పాల్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆయనను విచారించారు. ఉదయం 11 గంటల నుంచి విచారించిన పోలీసులు రాత్రి 9గంటల సమయంలో విజయ్ పాల్‌ను అరెస్టు చేశారు. రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ హింస కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ విజయ్‌పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత అరెస్టు చేసినట్టు ఎస్పీ దామోదర్ అధికారికంగా ప్రకటించారు.
2021లో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌పై రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రఘురామ నివాసం నుంచి ఆయన్ను బలవంతంగా గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారని రఘురామ ఈ ఏడాది జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మరోవైపు సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ ను అరెస్ట్ చేయడం సంతోషంగా ఉందన్నారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు. సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ ఎన్నో దందాలు చేశారనీ.. ఆయన పాపం పండిందని చెప్పారు. ఓ క్రిమినల్ లాగా తనకు ఏమీ తెలియదు అని క్రిమినల్ లాగా సమాధానాలు చెప్తున్నారనీ..తనను కస్టోడియల్ టార్చర్ కు గురిచేశారని మండిపడ్డారు. ఈ కుట్రలో పీవీ సునీల్ కుమార్ ఉన్నారనీ.. కీలక నిందితుడిని అరెస్ట్ చేయడం సంతోషమని చెప్పారు రఘురామ. సునీల్ కుమార్,విజయ్ పాల్ అంత ఒక ముఠా అనీ.. అందరూ కలిసి కుట్ర చేశారని అన్నారు.
Author: VS NEWS DESK
pradeep blr