ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పాలన సాగించిన నాటి నుంచి కేంద్రం ప్రత్యేకమైన దృష్టిని ఏపీపైన కేంద్రీకరించింది. రాష్ట్రంలో అనేక రంగాలలో అభివృద్ధి కోసం కేంద్రం భారీగా నిధులను కేటాయిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా పర్యాటక రంగాన్ని కొత్త మలుపు తిప్పే విధంగా పలు ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 172.34 కోట్ల రూపాయలను కేటాయించింది.
సాస్కి పథకంలో ఏపీకి వరాలు
ఏపీ సీఎం చంద్రబాబుకు వరుస శుభవార్తలను చెబుతున్న మోదీ సర్కార్ ఏపీ ప్రగతి పథంలో పయనించేందుకు తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తేల్చి చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకంగా అభివృద్ధి కోసం మూలధన పెట్టుబడి కి ప్రత్యేక తోడ్పాటునందించే పథకం అయిన సాస్కి పథకంలో భాగంగా 172.34 కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టుల అభివృద్ధికి ఈ నిధులను కేటాయించింది.
సాస్కి పథకంలో భాగంగా పర్యాటక రంగానికి కేంద్రం నిధులు
ఒక్కో రాష్ట్రానికి రెండు ప్రాజెక్టులు చొప్పున, మొత్తం తొమ్మిది రాష్ట్రాలకు పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాజెక్టులకు నిధులను కేటాయించిన కేంద్రం తొలివిడతగా 113.75 కోట్లను కేంద్రం విడుదల చేసింది. సాస్కి పథకంలో భాగంగా కేంద్రం ఇచ్చే నిధుల కోసం దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు పోటీ పడగా, ఎనిమిది రాష్ట్రాలు మధ్యలోనే పోటీ నుంచి వెనక్కు తప్పుకున్నాయి.
ఏపీకి అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా
మిగిలిన రాష్ట్రాలలో 11 రాష్ట్రాలకు ఒకటి చొప్పున 9 రాష్ట్రాలకు రెండు చొప్పున ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇచ్చింది. అందులో ఏపీ కూడా ఉండడం ముఖ్యమైన విషయం. సాస్కీ పథకంలో భాగంగా ఏపీకి అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు అంగీకరించింది. అయితే కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన సూర్యలంక బీచ్ అభివృద్ధి పనుల పై మాత్రం కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
త్వరలోనే ఈ రెండు ప్రాజెక్ట్ లకు టెండర్లు
ఈ రెండు ప్రాజెక్టులకు త్వరలో టెండర్లు పిలిచి జనవరిలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కృషి కారణంగానే సాస్కీ పథకంలో ఏపీకి ప్రాధాన్యత దక్కిందన్నారు. ఇక తామ ప్రతిపాదించిన సూర్యలంక బీచ్ ను మరో పథకంలో అభివృద్ధి చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Author: VS NEWS DESK
pradeep blr