Search
Close this search box.

కాకినాడ పోర్టుకు పవన్-రేషన్ బియ్యంతో పట్టుబడ్డ సౌతాఫ్రికా షిప్ పరిశీలన..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున రేషన్ బియ్యం కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలివెళ్లిపోతోందంటూ గగ్గోలు పెట్టిన కూటమి నేతలకు వారి సొంత ప్రభుత్వంలోనూ ఇదే సమస్య తప్పడం లేదు. కాకినాడ పోర్టులో పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వరుస తనిఖీలు చేస్తున్నా పరిస్దితిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యంతో వెళ్తున్న ఓ సౌతాఫ్రికా షిప్ ను కలెక్టర్, ఎస్పీ ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు.

ఈ షిప్ లో దాదాపు 640 టన్నుల అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.ఈ షిప్ ను పరిశీలించేందుకు ఇవాళ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్తున్నారు. సౌతాఫ్రికా షిప్ తో పాటు మరో బాచి (షిప్ కు లోడు తరలించే లాంచీ)లో వేలాది టన్నుల బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో దాన్ని కూడా పవన్, మనోహర్ కలిసి పరిశీలించనున్నారు.

ప్రభుత్వం ఎంత కట్టడి చేస్తున్న రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ దేశాలకు రైస్ మాఫియా తరలిస్తూనే ఉంది. అదీ కాకినాడ కేంద్రంగా భారీగా రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్న లవన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్ ను అధికారులు గుర్తించారు. వీరికి అడ్డుకట్ట వెయ్యడానికి స్వయంగా రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇవాళ నేరుగా పరిశీలన చేయనున్నారు. అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇవ్వబోతున్నారు. పవన్ టూర్ తర్వాత అయినా ఈ అక్రమ బియ్యం రవాణా ఆగుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr