Search
Close this search box.

KTR: కేసీఆర్ దీక్ష స్ఫూర్తిగా మరో పోరాటం చేస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సాధనకు కేసీఆర్ రగిలించిన ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ తట్టిలేపేలా.. అప్పటి ఉద్యమాన్ని గుర్తుతెచ్చేలా… ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కార్‌ను ఇరుకునపెట్టేలా… రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. మరి 33 జిల్లాల్లో బీఆర్ఎస్ దీక్షా దివస్‌ ఎలా జరిగింది…? కాంగ్రెస్‌పై బీఆర్ఎస్‌ ఎక్కుపెట్టిన బాణాలేంటి…?

KTR: కేసీఆర్ దీక్ష స్ఫూర్తిగా మరో పోరాటం చేస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Ktr Harish Rao

తెలంగాణలో కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తా… కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనియ్యా… ఇవి తరుచూ సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై చేస్తున్న వ్యాఖ్యలు.. ఇక ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్‌ ఫుల్‌ సీరియస్‌గా తీసుకుంది. ఎప్పటికప్పుడు రేవంత్‌ కామెంట్స్‌కి కౌంటర్లు ఇస్తూనే… దీక్షా దివస్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా 33 జిల్లాల్లోని అన్ని నియోజవర్గాల్లో నిర్వహించింది. బీఆర్ఎస్ పార్టీ పవర్‌ ఏంటో తెలిసేలా… గులాబీ జెండాకు పూర్వవైభవం తెచ్చేలా దీక్షా దివస్‌ నిర్వహించి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటూ గళమెత్తింది.. అంతేకాదు.. తెలంగాణ వచ్చుడో తాను సచ్చుడో అంటూ 2009 నవంబర్‌ 29న కేసీఆర్ చేపట్టిన ఉద్యమాన్ని గుర్తుచేస్తూ సెంటిమెంట్‌ రగిలిస్తోంది.

ఇక రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్‌ ఘనంగా జరిగింది.. అన్ని నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్‌ కార్యాలయాల్లో పార్టీ జెండా ఎగరేసి… కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు గులాబీ శ్రేణులు. తెలంగాణ సాధకుడు కేసీఆర్ అంటూ ఎమోషనల్‌ స్పీచ్‌లిస్తూనే… తెలంగాణలో కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేయడం రేవంత్‌ తరం కాదంటూ కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. వచ్చేది బీఆర్ఎస్‌ ప్రభుత్వమే అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

కరీంనగర్‌ దీక్షా దివస్‌లో పాల్గొన్న బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్.. మరోసారి ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం వచ్చిందన్నారు. అప్పుడు ఎంతోమందిని బలితీసుకున్న కాంగ్రెస్‌.. మళ్లీ అధికారంలోకి వచ్చి ప్రజలను హింసిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ దీక్ష స్ఫూర్తిగా మళ్లీ ఒకసారి సంకల్పం తీసుకొని కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకూ మనం పోరాటం చేయాల్సి ఉందన్నారు.

సిద్ధిపేట దీక్షా దివస్‌లో పాల్గొన్నారు హరీష్‌రావు. గతంలో బీఆర్ఎస్‌ను అంతం చేయాలన్న కాంగ్రెస్‌ పాచికలు పారలేదన్నారు. ఇప్పుడొచ్చిన రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను టచ్‌ చేయలేరంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి తరం కాదన్నారు హరీష్‌రావు.

మొత్తంగా… అప్పటి ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ రగిలించేలా… ఇప్పటి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా.. 2028లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్‌ దీక్ష దివస్‌కి నిర్వహించింది. మరి బీఆర్ఎస్‌కి కౌంటర్‌గా అధికార కాంగ్రెస్‌ ఏం చేయబోతోంది…? దీక్ష దివస్‌పై ఎలా రియాక్ట్‌ కానుంది అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು