సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలు, హీరోయిన్స్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరోకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకూ పై ఫొటోలో ఉన్న హీరో ఎవరో తెలుసా.?
సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు కుర్ర హీరోలు. పెద్ద హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే కొంతమంది యంగ్ హీరోలు ఆచితూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. పై ఫొటోలో ఉన్న కుర్రాళ్లలో ఓ స్టార్ హీరో ఉన్నాడు ఎవరో తెలుసా.? అతను వరుస విజయాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. రీసెంట్గా ఆయన ఓ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఏకంగా వందకోట్లకు పైగా వసూల్ చేసింది ఆ సినిమా. ఇంతకూ పై ఫొటోలో ఉన్న స్టార్ హీరో ఎవరో కనిపెట్టరా.? అతనంటే అమ్మాయిలు పడిచచ్చిపోతారు. ఇంతకూ అతను ఎవరంటే..

పై ఫొటోలో ఉన్న యంగ్ హీరో ఎవరో కాదు. రీసెంట్ గా వరుసగా రెండు బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో దుల్కర్ సల్మాన్. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు వరుసగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. మలయాళంలో వరుసగా సినిమాలు చేసి మెప్పించిన దుల్కర్ తెలుగులో నేరుగా మహానటి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు ఓకే బంగారం సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఇక మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.