Andhra News: దందాల్లో ఇది నెక్స్ట్ లెవెల్.. మౌత్ ఫ్రెష్, ఐ డ్రాప్స్ సప్లై చేసి మరీ..

మహారాష్ట్రలో కేజీ గంజాయి పదిహేను వేల రూపాయలకు కొనుగోలు చేసి… అనంతపురంలో ఐదు గ్రాముల పొట్లాలు కట్టి కాలేజీ విద్యార్థులకు అమ్ముతున్న గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అయితే పోలీసులు గంజాయి ముఠాకు సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన వార్తలు బయటపెట్టారు. ఇంతకీ ఆ షాకింగ్ నిజాలు ఏంటంటే?

మహారాష్ట్ర టూ అనంతపురం గంజాయి స్మగ్లింగ్… మహారాష్ట్రలో కేజీ గంజాయి పదిహేను వేల రూపాయలకు కొనుగోలు చేసి… అనంతపురంలో ఐదు గ్రాముల పొట్లాలు కట్టి కాలేజీ విద్యార్థులకు అమ్ముతున్న గంజాయి ముఠా.. అలా గంజాయి మత్తుకు అలవాటు పడ్డ విద్యార్థులే… గంజాయిస్ స్మగ్లర్లతో చేతులు కలిపి… విద్యార్థులు కూడా గంజాయి వ్యాపారం చేయటం మొదలుపెట్టారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో పదిమంది గంజాయిస్ స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు… నాలుగు కేజీల 270 గ్రాముల గంజాయితో పాటు.. 10 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ గంజాయి స్మగ్లర్లు తమ వ్యాపారంలో కస్టమర్లకు అనేక సౌలభ్యాలు కల్పించారు. ముఖ్యంగా విద్యార్థులు గంజాయి సేవించి ఇంటికి వెళితే తల్లిదండ్రులకు దొరక్కుండా ఉండేందుకు ఇంతకు మునుపెన్నడు చూడని విధంగా తప్పించుకునే మార్గాలు చూపిస్తున్నారు ఈ గంజాయి స్మగ్లర్లు.. తాడిపత్రికి చెందిన సయ్యద్ మహమ్మద్ నవాజ్ అనే యువకుడు మరో తొమ్మిది మంది విద్యార్థులతో కలిసి ముఠాగా ఏర్పడి గంజాయి స్మగ్లింగ్ చేయడం ప్రారంభించాడు. వీళ్ళ టార్గెట్ కాలేజీ విద్యార్థులే. ఎందుకంటే కాలేజీ విద్యార్థులు అయితేనే గంజాయి మత్తు కోసం ఎక్కువ డబ్బులు ఇస్తారని.. గంజాయి ముఠా కాలేజీ స్టూడెంట్స్‌ని టార్గెట్‌గా చేసుకుంది.

గంజాయి సేవించే వినియోగదారులకు.. పోలీసులకు పట్టుబడిన గంజాయి ముఠా.. కల్పిస్తున్న సేవలు చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. గంజాయి తాగడానికి అవసరమైన ఓసీ.. గంజాయి వాసన తెలియకుండా ఉండేందుకు మౌత్ ఫ్రెషనర్స్ కూడా ఈ ముఠా గంజాయితో పాటు సప్లై చేస్తుంది. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. గంజాయి సేవించినప్పుడు కళ్ళు బాగా ఎరుపెక్కుతాయి.. దీంతో పేరెంట్స్ విద్యార్థులను గుర్తుపట్టే అవకాశం ఉంది. అయితే గంజాయి సేవించినట్లు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మౌత్ ఫ్రెషనర్స్‌తో పాటు.. కళ్ళు ఎర్ర పడకుండా ఉండేందుకు ఐ డ్రాప్స్ కూడా ఈ ముఠా సప్లై చేస్తుంది. మహారాష్ట్రలోని సోలాపూర్ నుంచి గంజాయి కొనుగోలు చేసి రైళ్ల ద్వారా అనంతపురం తీసుకొచ్చి కాలేజీ విద్యార్థులకు గంజాయి అమ్ముతున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో.. పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లి జీవితాలు నాశనం చేసుకోవద్దని.. గంజాయి.. ఇతర మాదకద్రవ్యాలకు బానిసలై యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటుందని.. క్షణకాలం ఆనందం కోసం నూరేళ్ల జీవితంలో వెలుగును దూరం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ జగదీష్ విద్యార్థులకు సూచిస్తున్నారు.

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು