శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల దీక్షల సీజన్ ముగిసింది. డిసెంబర్ 26న మండల పూజ అనంతరం ఆలయం మూసివేశారు. ఈ నెల 29 వరకు ఆలయం మూసి ఉంచుతామని, తిరిగి మకర విళక్కు సీజన్ కోసం డిసెంబరు 30న సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తామని ట్రావెన్ కోర్ అధికారులు తెలిపారు.
తంత్రి కందరరావు రాజీవరు కుమారుడు కందరారు బ్రహ్మదత్తుడు, మేల్‌శాంతి అరుణ్‌కుమార్ నంబూతిరి ఆధ్వర్యంలో మండల పూజలు నిర్వహించారు.డిసెంబర్ 30 సాయంత్రం 5 గంటలకు మకరవిళక్కు ఉత్సవాల కోసం ఆలయం తెరవబడుతుంది. జనవరి 14న మకరవిళక్కు నిర్వహిస్తారు. జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తారు.
Author: VS NEWS DESK
pradeep blr