అల్లు అర్జున్‌పై తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ప్రమాదంతో వివాదంలో ఇరుక్కున్న అల్లు అర్జున్‌పై ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విమర్శలు గుప్పించారు.

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ప్రమాదంతో వివాదంలో ఇరుక్కున్న అల్లు అర్జున్‌పై ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వంతో ఇగో క్లాష్‌ని ప్రేరేపించినందుకు అల్లు అర్జున్‌పై భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు.

గతంలో పలువురు స్టార్స్ సినిమాలను తమ, తమ అభిమానులతో కలిసి చూసేవారని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చిందని, ఆయా స్టార్స్ ఎక్కడికి వెళుతున్నారో, ఏమి చేస్తున్నారో కూడా సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతూ ఉందని అన్నారు. ఇటీవల జరిగిన ఘటనలు కూడా అలా సమాచారాం తెలుసుకుని అభిమానులు దూసుకురావడమే ఓ కారణమని అన్నారు. సినిమా చూసేసిన తర్వాత రోడ్ షో చేయకుండా ఉండి ఉంటే బాగుండేదన్నట్లుగా తన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

సంధ్య థియేటర్ ఘటన తర్వాత టిక్కెట్ల పెంపుదల లేదా బెనిఫిట్ షోలను అనుమతించకుండా తెలంగాణ ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించింది.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು