సీఎం రేవంత్‌కు శాలువా కప్పి సత్కరించిన నాగార్జున

సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలను సీఎం రేవంత్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు టాలీవుడ్‌ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే.

సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలను సీఎం రేవంత్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు టాలీవుడ్‌ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున స్వయంగా రేవంత్‌కు శాలువా కప్పి నవ్వుతూ పలకరించారు. కాగా కొన్ని రోజుల క్రితం ఆయనకు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. దీంతో నాగార్జున.. ప్రభుత్వంపై మండిపడుతూ కోర్టుకు కూడా వెళ్లారు.

అటు తనకు వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తుం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టలేమన్నారు. తనకు ప్రత్యేకంగా ఎలాంటి రాగద్వేషాలు లేవని చెప్పారు. టాలీవుడ్‌ చిత్రపరిశ్రమకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. అదే సమయంలో ప్రభుత్వానికి సినీ పరిశ్రమ సహకరించాలని కోరారు. చిత్ర పరిశ్రమ రాజకీయాలను దూరం పెట్టాలని సూచించారు.

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು