కేటీఆర్‌కు మ‌రోసారి ఊరట ఫార్ములా-ఇ రేస్ కేసులో అక్రమాలకు సంబంధించిన కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు అరెస్టు నుండి తెలంగాణ హైకోర్టు ఊరటను ఇచ్చింది.

ఫార్ములా-ఇ రేస్ కేసులో అక్రమాలకు సంబంధించిన కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు అరెస్టు నుండి తెలంగాణ హైకోర్టు ఊరటను ఇచ్చింది. డిసెంబర్ 31 వరకు రిలీఫ్ పొడిగించింది. ఫార్ములా ఈ-రేసింగ్ ఈవెంట్‌ను ఫిబ్రవరి 2023లో హైదరాబాద్‌కు తీసుకురావడంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని కేటీ రామారావుపై అవినీతి నిరోధక శాఖ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. కేటీఆర్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొనగా, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ (ఎంఎయుడి) మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ రెండో ముద్దాయిగా, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండిఎ) మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బిఎల్‌ఎన్‌ రెడ్డిని మూడో ముద్దాయిగా పేర్కొన్నారు.

ఫార్మూలా- ఈ కారు రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను డిసెంబర్ 27న తెలంగాణ హైకోర్టు విచారించింది. కోర్టు డిసెంబర్ 31 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು