పల్లెటూరి కుర్రాడు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు.. సింగర్ దిల్జీత్‌ను ప్రశంసించిన ప్రధాని మోదీ

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్‌ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేశాడు దిల్జీత్ దోసాంజ్‌. ఈ సమావేశంలో దిల్జీత్ కొన్ని అంశాలపై మాట్లాడారు. దిల్జీత్ దోసాంజ్‌ పై మోదీ ప్రశంసలు కురిపించారు. పల్లెటూరి కుర్రాడు ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు అని మోదీ కొనియాడారు.

ప్రముఖ బాలీవుడ్ గాయకుడూ దిల్జీత్ దోసాంజ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందారు. ఆయన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంటాయి. అలాగే ఆయన అనేక దేశాల్లో ప్రోగ్రామ్స్ చేశారు. దిల్జీత్ దోసాంజ్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన పాటలను ఇష్టపడుతుంటారు. తాజాగా దిల్జీత్ దోసాంజ్‌కి నరేంద్ర మోడీని కలిసే అవకాశం వచ్చింది . ఈ ఆనందకర క్షణానికి సంబంధించిన వీడియోను దిల్జీత్ దోసాంజ్, నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇది చాలా గుర్తుండిపోయే కథ. ‘ఈ పర్యటనలోని విశేషాలు ఇవే’ అనే క్యాప్షన్‌తో నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘భారత్‌లోని ఓ పల్లెటూరి కుర్రాడు ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం’ అంటూ దిల్జీత్ గురించి ప్రధాని మోదీ గొప్పగా రాసుకొచ్చారు.

‘మీ కుటుంబం మీకు దిల్జీత్ (హృదయ విజేత) అని పేరు పెట్టారు. నువ్వు ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నావు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ దిల్జీత్  ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మాటలకు దిల్జీత్ ధన్యవాదాలు తెలిపారు. మనం పుస్తకాల్లో ‘మేరా భారత్ మహాన్’ అని చదివేవాళ్లం. దేశమంతా తిరిగాక మేరా భారత్‌ను మహాన్ అని ఎందుకు పిలుస్తారో అర్థమైంది’ అని దిల్జీత్ దోసాంజ్ అన్నారు. “భారత వైవిధ్యమే మన బలం” అని మోదీ అన్నారు. మోదీ పని తీరును దిల్జీత్ దోసాంజ్ ప్రశంసించారు. ఈ సందర్శనలో దిల్జీత్ గురునానక్ పాటను పాడారు. న్యూ ఇయర్ సందర్భంగా మోదీని కలిసినందుకు దిల్జీత్ దోసాంజ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో పై అభిమానులు లైకులు వర్షం కురిపిస్తున్నారు.

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು