ఎలాన్ మస్క్ స్టార్ లింక్ కు మోడీ చుక్కలు ? ఎంట్రీ కావాలంటే ఈ కండీషన్లు..!

అమెరికా కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ సంస్థ భారత్ లో ఎంట్రీకి అన్నీ సిద్దం చేసుకుంటున్న వేళ కేంద్రం షాకిచ్చింది. ఇప్పటికే భారత్ కు చెందిన ఎయిర్ టెల్, జియోతో ఒప్పందాలు చేసుకున్న స్టార్ లింక్ ఇక ఎంట్రీ ఇవ్వడమే లేటు అనుకుంటున్న తరుణంలో కేంద్రం కీలక షరతులు బయటపెట్టింది. వాటికి ఒప్పుకుంటేనే స్టార్ లింక్ కు దేశంలో ఎంట్రీ ఇస్తామని తేల్చిచెప్పేసింది. దీంతో మస్క్ చిక్కుల్లో పడ్డారు.గతంలో ఎలాన్ మస్క్ తన కార్ల సంస్థ టెస్లాకు భారత్ లో ఎంట్రీ కోరినప్పుడు విధించిన తరహా కండిషన్లను ఇప్పుడు స్టార్ లింక్ విషయంలోనూ కేంద్రం విధిస్తోంది.

అప్పట్లో టెస్లా కార్లను అమెరికాలో తయారు చేసి ఇక్కడికి పంపించి పన్ను రాయితీలు అడిగితే మోడీ ఒప్పుకోలేదు.. దానికి బదులు ఇక్కడే టెస్లా ప్లాంట్ లోనే వాటిని తయారు చేయాలని కండిషన్ పెట్టారు. దీంతో అప్పట్లో మస్క్ వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ఎలాగోలా భారత్ లో టెస్లా కార్లకు మస్క్ లైన్ క్లియర్ చేసుకున్నారు.ఇప్పుడు స్టార్ లింక్ ఇంటర్నెట్ కాల్ సదుపాయం విషయంలోనూ కేంద్రం ఎలాన్ మస్క్ కు ముందస్తు షరతులు పెట్టేసింది. తొలుత ఎంట్రీ ఇచ్చే విషయంలో సానుకూలంగా వ్యవహరించిన కేంద్రం..

ఇప్పుడు స్టార్ లింక్ తమ షరతులకు ఒప్పుకుంటేనే ఎంట్రీ ఇస్తామంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎయిర్ టెల్, జియో వంటి భారతీయ టెలికాం దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న స్టార్ లింక్ వాటి నుంచి వెనక్కి తగ్గే పరిస్ధితి లేదు. దీంతో స్టార్ లింక్ కేంద్రం కండీషన్లకు అంగీకరించక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది.ఇంతకీ కేంద్రం పెడుతున్న కండీషన్లు ఏంటో తెలుసా ? స్టార్ లింక్ తమ సేవల కంట్రోల్ సెంటర్ ను అమెరికాలో కాకుండా భారత్ లోనే పెట్టాలని కోరుతోంది.

అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు కాల్స్, ఇంటర్నెట్ నిలిపేయాల్సి వస్తే భారత్ లో ఉండే కార్యాలయంతో డీల్ చేసుకోవడం తమకు సులువని, అమెరికాలో ఉంటే కష్టమని చెబుతోంది. అలాగే అత్యవసర పరిస్ధితుల్లో స్టార్ లింక్ కాల్స్ ను తమ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలు యాక్సెస్ చేసుకునే వీలు కల్పించాలని కోరుతోంది. అంటే కస్టమర్ల కాల్స్ ను కేంద్ర దర్యాప్తు సంస్థలు ట్రాక్ చేసుకోవడానికి వీలు కల్పించాలని కోరుతోంది. అలాగే మరికొన్ని కండిషన్లు కూడా ఉన్నాయి. వీటిని అంగీకరించే విషయంలో స్టార్ లింక్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು