Dilruba Movie Review: దిల్ రూబా మూవీ రివ్యూ.. కిరణ్ అబ్బవరం మళ్లీ హిట్టు కొట్టాడా.. ?

‘క’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వచ్చిన సినిమా దిల్ రూబా. విశ్వ కరుణ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ముందు నుంచి ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నాడు కిరణ్. నిర్మాత అయితే నచ్చకపోతే వచ్చి కొట్టండి అని ఆఫర్ కూడా ఇచ్చాడు. మరి వీళ్ళ నమ్మకం నిజమైందా..?

మూవీ రివ్యూ: దిల్ రూబా

నటీనటులు : కిరణ్ అబ్బవరం, రుక్సర్ ధిల్లాన్, నజియా డేవిసన్, జాన్ విజయ్, సత్య, గెటప్ శ్రీను, విజయ్ రంగరాజు తదితరులు

సంగీతం : సామ్ సి ఎస్

సినిమాటోగ్రఫీ : విశ్వాస్ డానియల్

ఎడిటర్ : ప్రవీణ్ కే ఎల్

దర్శకుడు : విశ్వ కరుణ్

నిర్మాతలు: విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి

‘క’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వచ్చిన సినిమా దిల్ రూబా. విశ్వ కరుణ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ముందు నుంచి ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నాడు కిరణ్. నిర్మాత అయితే నచ్చకపోతే వచ్చి కొట్టండి అని ఆఫర్ కూడా ఇచ్చాడు. మరి వీళ్ళ నమ్మకం నిజమైందా..?

కథ:

చిన్నప్పటి నుంచి మ్యాగీ (నజియా)ని ప్రేమిస్తాడు సిద్ధార్థ్ రెడ్డి అలియాస్ సిద్దూ (కిరణ్ అబ్బవరం). పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటాడు. చివరి నిమిషంలో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్లిపోతుంది మ్యాగీ. దాంతో మనోడు దేవదాసులా మందుకు అలవాటు అయిపోయి.. అమ్మాయిలకు దూరంగా ఉంటాడు. అమ్మ చెప్పిందని బెంగళూరు వెళ్లి ఒక కాలేజీలో చేరుతాడు. కాలేజీలోకి రాకముందే పబ్బులో ఒక గొడవ నుంచి అంజలి (రుక్సర్)ని కాపాడతాడు. దాంతో ఫస్ట్ లుక్‌లోనే సిద్దూతో ప్రేమలో పడిపోతుంది అంజలి. అక్కడ్నుంచి తనను ప్రేమించమని వెంట పడుతుంది. ఒక బలమైన సిచ్యువేషన్‌లో సిద్దూ కూడా అంజలిని ప్రేమిస్తాడు. అయితే సారీ, థ్యాంక్స్ లాంటివి చెప్పే అలవాటు లేని సిద్ధూకు.. ఓ సిచ్చువేషన్‌లో తన కాలేజ్‌లోనే చదివే విక్కీ (క్రాంతి కిల్లి)కి సారీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ చెప్పడు.. దాంతో అంజలితో బ్రేకప్ అవుతుంది. ఎందుకు సిద్దూ సారీ, థ్యాంక్స్ చెప్పడు అనే దానికి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. వాళ్ళిద్దరిని కలపడానికి మాజీ లవర్ మ్యాగీ అమెరికా నుంచి ఇండియాకు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. సిద్దూ ప్రజెంట్ లవ్‌ను.. పాస్ట్ లవర్ వచ్చి సెట్ చేసిందా లేదా అనేది కథ.

కథనం:

కొన్ని కథలు వినేటప్పుడు వచ్చిన కిక్.. స్క్రీన్ మీదకు వచ్చిన తర్వాత కనిపించవు. దిల్ రూబా కూడా అలాంటి ఓ ఐడియానే. వినడానికి భలే క్రేజీగా అనిపిస్తుంది. ప్రజెంట్ లవ్ సెట్ చేయడానికి పాస్ట్ లవర్ రావడం అనే ఐడియా కొత్తగానే కాదు క్రేజీగానే ఉంది. కానీ దాన్ని స్క్రీన్ మీదకు తీసుకొచ్చేటప్పుడు చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అవేం పట్టించుకోకుండా సింపుల్‌గా తీస్తామంటే ఎటూ కాకుండా పోతుంది సినిమా. దిల్ రూబా విషయంలోనూ ఇదే జరిగింది. మంచి ఐడియాను చేజేతులా నాశనం చేసాడు దర్శకుడు విశ్వ కరుణ్. అందులో కిరణ్ అబ్బవరం పాత్ర కూడా లేకపోలేదు. తనపై స్టార్ హీరో రేంజ్‌లో డైలాగులు కావాలని ఆయన అడిగాడో లేదంటే దర్శకుడికే అలా అనిపించి మాటలు రాసాడో తెలియదు కానీ చాలా ఓవర్ అనిపిస్తుంది కొన్ని డైలాగులు వింటుంటే. అవి కిరణ్ అబ్బవరంకు అస్సలు సెట్ కాలేదు. సారీ, థాంక్స్ అనే పదాల గొప్పతనం కోసం సినిమా తీసినట్టు అనిపించింది. రోజుకు వందల సార్లు వాడే ఈ పదాలను హీరో అసలు వాడడు. అతనితో సారీ చెప్పించుకోవడానికి విలన్లు చుట్టూ తిరుగుతుంటారు. ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఇంత చిన్న విషయం మీద ఒక సినిమా తీయాలి అనుకోవడం నిజంగానే సాహసం. ఐడియా ఎంత క్రేజీగా ఉన్నా కూడా.. ఎగ్జిక్యూషన్ చాలా నీరసంగా ఉంది. కన్ఫ్యూజన్ ఎక్కువైపోయి కథ ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం కాదు. కాలేజీలో మొదలైన కథ రాయలసీమ మీదుగా ఎక్కడెక్కడో తిరుగుతుంది.

మధ్యమధ్యలో ఫ్యాక్షన్ సినిమాలో బ్యాక్ డ్రాప్ చెప్పినట్టు.. నేనెవరో తెలుసా నా బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా అని హీరో అలా ఎందుకు చెప్పాడో ఎవరికీ అర్థం కాదు. నీట్ గా చెప్పాల్సిన కథలోకి.. అనవసరంగా యాక్షన్ మాస్ అంటూ ఏవేవో దూర్చాడు దర్శకుడు. దానికి తోడు కిరణ్ అబ్బవరం మీద రాసిన డైలాగ్స్ బాగా ఓవర్ అనిపించింది. ఇమేజ్ కు మించిన డైలాగులు ఉంటే కచ్చితంగా అది సినిమాకు మైనస్. ఫస్టాఫ్ కాస్త బెటర్.. ఏదో కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అనిపిస్తుంది. సెకండాఫ్ అయితే ఎటు పోతుందో కూడా అర్థం కాదు. దానికి తోడు అనవసరపు ఫైట్స్ ఇబ్బంది. అక్కడ జరిగే సీన్ చూస్తే హీరో హీరోయిన్ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటారు. ఏ కాంప్లికేషన్స్ లేని వాళ్ళ ప్రేమ కథ మధ్యలోకి ఏదో ఒకటి కావాలని పుల్లపెట్టినట్టు దర్శకుడు ఏదో ఒక సీన్ రాసుకున్నాడు. వాళ్ళిద్దరూ విడిపోతున్నారు అంటే బలమైన ఎమోషన్ ఏదో ఒకటి ఉండాలి. అలాంటిది ఒక్కటి కూడా కనిపించదు. మళ్లీ ఇద్దరికీ ఒకరు ఉంటే ఒకరికి ప్రాణం అయినా కూడా మాట్లాడుకోరు చూసుకోరు. ఎందుకురా అంటే హీరో సారీ చెప్పకపోతే నేను ప్రేమించను అంటుంది హీరోయిన్. హీరో ఏమో సారీ చెప్పను అంటాడు. క్లైమాక్స్ వరకు ఇదే కథను లాక్కుంటూ వచ్చాడు దర్శకుడు విశ్వ.

నటీనటులు:

కిరణ్ అబ్బవరం స్క్రీన్ అప్పియరెన్స్ ఓకే కానీ డైలాగ్ డెలివరీలో చాలా మారాలి. వాయిస్ బాగానే ఉన్నా డిక్షన్ అస్సలు బాగోలేదు. పైగా చాలా ఎమోషన్స్ ఒకే ఎక్స్ప్రెషన్‌తో క్యారీ చేస్తున్నాడు. హీరోయిన్స్ రుక్సర్ థిల్లన్, నజియా డేవిసన్ పర్లేదు. సీనియర్ నటుడు ఆనంద్, జాన్ విజయ్, క్రాంతి కిల్లి, కమెడియన్ సత్యా, దివంగత విజయ్ గంగరాజు వీళ్ళందరూ పర్లేదు.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకి పాజిటివ్ ఏదైనా ఉంది అంటే అది స్యామ్ సిఎస్ సంగీతం మాత్రమే. RR కూడా బాగానే ఉంది. ఎడిటింగ్ చాలా వీక్. రెండు గంటల్లోపే తేల్చాల్సిన కథను లాగి లాగి వదిలారు. సినిమాటోగ్రఫీ ఓకే. దర్శకుడు విశ్వ కరుణ్ తీసుకున్న ఐడియాకు.. తీసిన సినిమాకు చాలా మిస్ ఫైర్ అయ్యింది. ఇక నిర్మాత రవి గురించి చెప్పాలి.. నా సినిమా నచ్చకపోతే మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెడతాను వచ్చి చితక్కొట్టండి అన్నాడు. ఇప్పుడు ఆ మాటలు ఆడియన్స్ సీరియస్‌గా తీసుకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుంది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా దిల్ రూబా.. సారీ, థాంక్స్‌కు మధ్య దిల్ పసంద్ అయిపోయింది..!

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು